ICC Test Rankings : రోహిత్ శ‌ర్మ‌కు షాకిచ్చిన య‌శ‌స్వి జైస్వాల్.. త్వ‌ర‌లోనే కోహ్లికి ఎస‌రు?

టీమ్ఇండియా యువ బ్యాట‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు.

ICC Test Rankings : రోహిత్ శ‌ర్మ‌కు షాకిచ్చిన య‌శ‌స్వి జైస్వాల్.. త్వ‌ర‌లోనే కోహ్లికి ఎస‌రు?

Yashasvi Jaiswal leapfrogs Rohit Sharma for career-best spot

Test Rankings : టీమ్ఇండియా యువ బ్యాట‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న టెస్టు సిరీస్‌లో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నాడు. అంతేకాదండోయ్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లోనూ దుమ్ములేపుతున్నాడు. తాజాగా ప్ర‌క‌టించిన ర్యాంకింగ్స్‌లో త‌న కెరీర్ బెస్ట్ ర్యాంకు కు చేరుకున్నాడు. ఈ క్ర‌మంలో త‌న ఓపెనింగ్ పార్ట్‌న‌ర్‌, టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌ను సైతం అధిగ‌మించాడు.

బుధ‌వారం ఐసీసీ వెల్ల‌డించిన టెస్టు బ్యాట‌ర్ల ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు ఎగ‌బాకి 12వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. మ‌రోవైపు రోహిత్ శ‌ర్మ ఓ స్థానం దిగ‌జారి 13వ ర్యాంక్‌కు ప‌డిపోయాడు. ఇంగ్లాండ్‌తో సిరీస్ ఆడ‌న‌ప్ప‌టికీ విరాట్ కోహ్లి ఒక్క‌డే భార‌త్ త‌రుపున టాప్‌-10లో ఉన్నాడు. అత‌డు తొమ్మిదో స్థానంలో కొన‌సాగుతున్నాడు.  న్యూజిలాండ్ ఆట‌గాడు కేన్ విలియమ్సన్ త‌న అగ్ర‌స్థానాన్ని కాపాడుకోగా ఆసీస్ ఆట‌గాడు స్టీవ్‌స్మిత్ స్థానంలోనూ ఎటువంటి మార్పు లేదు. రెండో స్థానంలోనే ఉన్నాడు.

Duplicate Tea Powder: డూప్లికేట్ టీ పౌడర్.. గుర్తించడం ఎలా..?

ఇక రాంచీ టెస్టులో సెంచ‌రీతో స‌త్తా చాటాన ఇంగ్లాండ్ సీనియ‌ర్ ఆట‌గాడు జో రూట్ రెండు స్థానాలు ఎగ‌బాకి మూడో ర్యాంక్‌ను అందుకోగా కివీస్ ఆట‌గాడు డారిల్ మిచెల్ ఓ స్థానం దిగ‌జారి నాలుగో స్థానానికి ప‌డిపోయాడు. ఆ త‌రువాత వ‌రుస‌గా బాబ‌ర్ ఆజాం, ఉస్మాన్ ఖ‌వాజా, క‌రుణ‌ర‌త్నెలు ఉన్నారు.

ఐసీసీ పురుషుల టెస్ట్ ర్యాంకింగ్స్‌..

1. కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్‌) – 893 రేటింగ్ పాయింట్లు
2. స్టీవ్ స్మిత్(ఆస్ట్రేలియా) – 818
3. జో రూట్ (ఇంగ్లాండ్‌) – 799
4. డారిల్ మిచెల్ (న్యూజిలాండ్‌) – 780
5 . బాబర్ ఆజం (పాకిస్తాన్‌) – 768
6. ఉస్మాన్ ఖవాజా (ఆస్ట్రేలియా) – 765
7. దిముత్ కరుణరత్నే (శ్రీలంక‌) – 750
8. మార్నస్ లాబుస్చాగ్నే(ఆస్ట్రేలియా) – 746
9. విరాట్ కోహ్లీ (భార‌త్‌)- 744
10. హ్యారీ బ్రూక్ (ఇంగ్లాండ్‌) – 743
11. ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా) – 741
12. యశస్వి జైస్వాల్ (భార‌త్‌) – 727
13. రోహిత్ శర్మ (భార‌త్‌) – 720
14. రిషబ్ పంత్ (భార‌త్‌) – 699

Suresh Raina : రైనా సిక్స‌ర్ల వ‌ర్షం.. చూసి ఎన్నాళ్ల‌యిందో..!