Kaif Mahesh Babu
Mahesh Babu: క్రికెటర్లన్నా.. సినిమాల్లో హీరోలన్నా యూత్ లో పిచ్చ క్రేజ్. ఫ్యాషన్ ఐకాన్ గా భావిస్తూ.. తెగ ఫాలో అయిపోతుంటాం. ఆ బ్యాట్స్‌మెన్‌లా బ్యాటింగ్ చేయాలి.. లేదంటే ఆ హీరోలా డైలాగ్ చెప్పాలని చూస్తాం. ఇటీవల సోషల్ మీడియాలో నేరుగా క్రికెటర్లే సినిమా హీరోలను ఇమిటేట్ చేసేస్తున్నారు. తెలుగు హీరోలను ఫాలో అవుతూ.. డేవిడ్ వార్నర్ పలు వీడియోలు చేస్తే.. రీసెంట్ గా వీరేంద్ర సెహ్వాగ్.. పవన్ కల్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రంలోని డైలాగ్స్ చెప్పాడు.
ఇప్పుడు ఒకప్పటి టీమిండియా క్రికెటర్ మహ్మద్ కైఫ్ కూడా మహేశ్ బాబు డైలాగ్ చెప్పేస్తున్నాడు. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేశ్ బాబు పాపులర్ డైలాగ్ చెప్పి ఔరా అనిపించాడు. దూకుడు సినిమాలో మైండ్‌లో ఫిక్సయితే బ్లైండ్‌గా వెళ్లిపోతా అంటూ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ ఇమిటేట్ చేశాడు.
Indian Cricketer #MohammedKaif About Superstar #MaheshBabu ??
"MIND LO FIX AITHE BLIND GA VELLIPOTHA "⚡? pic.twitter.com/TCLx62N3kb
— ꓷ A Я K ?? (@GothamHero_) September 8, 2021
ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అటు మహేశ్ అభిమానులు, కైఫ్ అభిమానులకు తెగ షేర్ చేస్తున్నారు. దీనిని ఈగట్ స్పోర్ట్స్ EAGLE Sports అనే యూట్యూబ్ ఛానెల్ లో పోస్టు చేశారు. మహ్మద్ కైఫ్ చాలా కూల్‌గా మహేశ్ స్టైల్‌లో చెప్పిన ఈ డైలాగ్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Sai Dharam Tej: యాక్సిడెంట్‌కు గురైన బైక్ విలువెంతో తెలుసా..