Virat Kohli : కోహ్లీ పై పాకిస్థాన్ మాజీ పేస‌ర్ వ్యాఖ్య‌లు వైర‌ల్‌.. నేపాల్‌, జింబాబ్వే పై ఆడితే..

భార‌త విజ‌యాల్లో స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఈ మెగాటోర్నీలో ఓ శ‌త‌కంతో పాటు మూడు హాఫ్ సెంచ‌రీలు చేశాడు.

Virat Kohli-Mohammad Amir

Virat Kohli-Mohammad Amir : స్వ‌దేశంలో జ‌రుగుతున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్ వ‌రుస విజ‌యాల‌తో సెమీఫైన‌ల్‌కు దూసుకువెళ్లింది. భార‌త విజ‌యాల్లో స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఈ మెగాటోర్నీలో ఓ శ‌త‌కంతో పాటు మూడు హాఫ్ సెంచ‌రీలు చేశాడు. గురువారం శ్రీలంక‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 88 ప‌రుగులు చేశాడు. వ‌న్డేల్లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డును స‌మం చేసే అవ‌కాశాన్ని విరాట్ 12 ప‌రుగుల‌తో కోల్పోయాడు. ఈ క్ర‌మంలో పాకిస్థాన్ మాజీ ఆటగాడు మ‌హ్మ‌ద్ అమీర్ చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారాయి.

అభిమానుల్లో చాలా మంది విరాట్ కోహ్లీని ఇత‌ర దిగ్గ‌జ బ్యాట‌ర్ల‌తో పోల్చ‌డాన్ని మ‌హ్మ‌ద్ అమీర్ త‌ప్పుబ‌ట్టాడు. కోహ్లీ గ‌నుక నేపాల్‌, నెద‌ర్లాండ్స్‌, జింబాబ్వే, బంగ్లాదేశ్ వంటి దేశాల‌తో మ్యాచులు ఆడితే ఎప్పుడో స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డు బ‌ద్ద‌లు కొట్టేవాడ‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో శ్రీలంక మ్యాచ్‌లో కోహ్లీ అద్భుతంగా ఆడాడు అని అన్నాడు.  ప్ర‌తి బంతికి ప‌రుగులు తీశాడు. అత‌డి ఆట తీరును ప‌రిశీలిస్తే అది మీకు ఈజీగా అర్థమ‌వుతుంద‌ని మ‌హ్మ‌ద్ అమిర్ అన్నాడు.

Shaheen Afridi : 48 ఏళ్ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లో.. ఓ పాకిస్థాన్ బౌల‌ర్ చెత్త రికార్డు ఇదే..

విరాట్ కోహ్లీ ఇప్ప‌టి వ‌ర‌కు 288 వ‌న్డేల్లో 58 స‌గ‌టుతో 13,525 ప‌రుగులు చేశాడు. ఇందులో 48 శ‌త‌కాలు, 70 అర్ధ‌శ‌త‌కాలు ఉన్నాయి. మ‌రో రెండు సెంచ‌రీలు చేస్తే స‌చిన్ రికార్డును బ‌ద్ద‌లు కొడ‌తాడు. సచిన్ టెండూల్క‌ర్ వ‌న్డేల్లో 49 శ‌త‌కాలు చేసిన విష‌యం తెలిసిందే. స‌చిన్ 463 వ‌న్డేల్లో 44.8 స‌గ‌టుతో 18,426 ప‌రుగులు చేశాడు. ఇందులో 49 సెంచ‌రీలు, 96 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి.

ప్ర‌స్తుతం విరాట్ కోహ్లీ సూప‌ర్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లోనే స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డును అత‌డు బ్రేక్ చేసే అవ‌కాశాలు లేక‌పోలేదు. న‌వంబ‌ర్ 5న కోహ్లీ పుట్టిన రోజు. అదే రోజు భార‌త జ‌ట్టు కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్ వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో మ్యాచ్ ఆడ‌నుంది. ఈ ప్ర‌త్యేకమైన రోజున శ‌త‌కం చేసి స‌చిన్ సెంచ‌రీల రికార్డును స‌మం చేయాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.

Kane Williamson : వ‌చ్చాడు.. ఒక్క మ్యాచులో రెండు రికార్డులు.. కేన్ మామ‌తో మామూలుగా ఉండ‌దు

ట్రెండింగ్ వార్తలు