Mohammed Shami : రాష్ట్ర‌ప‌తి చేతుల మీదుగా అర్జున అవార్డు.. క‌ల నెర‌వేరింద‌న్న ష‌మీ

భార‌త స్టార్‌ పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ ప్ర‌తిష్టాత్మ‌క అర్జున పుర‌స్కారాన్ని అందుకున్నారు.

Mohammed Shami receives Arjuna Award

Mohammed Shami receives Arjuna Award : భార‌త స్టార్‌ పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ ప్ర‌తిష్టాత్మ‌క అర్జున పుర‌స్కారాన్ని అందుకున్నారు. ఢిల్లీలో జ‌రిగిన జాతీయ క్రీడా అవార్డుల ప్ర‌ధానోత్స‌వంలో భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము చేతుల మీదుగా ష‌మీ ఈ అవార్డును అందుకున్నారు. 2023లో అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న చేసిన క్రీడాకారుల‌కు కేంద్రం అవార్డుల‌తో స‌త్క‌రిస్తోంది. 26 మంది క్రీడాకారుల‌కు అర్జున పుర‌స్కారాల‌ను అంద‌జేసింది.

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో ష‌మీ సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. ఏడు మ్యాచుల్లో 24 వికెట్లు తీసి ఈ మెగాటోర్నీలో అత్య‌ధిక వికెట్లు తీసిన ఆట‌గాడిగా నిలిచాడు. టీమ్ఇండియా ఫైన‌ల్‌కు చేరుకోవ‌డంలో ష‌మీ కీల‌క పాత్ర పోషించాడు. దీంతో అర్జున అవార్డుకు అత‌డి పేరును బీసీసీఐ నామినేట్ చేసింది.

అర్జున అవార్డు అందుకున్న అనంత‌రం ష‌మీ మాట్లాడుతూ ఎమోష‌న‌ల్ అయ్యాడు. త‌న క‌ల నెర‌వేరింద‌ని చెప్పుకొచ్చాడు. ఎంతో మంది క్రీడాకారులు త‌మ జీవితంలో ఈ అవార్డు అందుకోలేర‌ని, ఈ అవార్డు కోసం త‌న‌ను నామినేట్ చేయ‌డం చాలా సంతోషాన్ని ఇచ్చింద‌న్నారు. ఇక అవార్డును సాధించ‌డం ఓ క‌ల‌గా ఉంద‌ని చెప్పుకొచ్చాడు.

Rohit Sharma : చిక్కుల్లో భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌..? చ‌ర్య‌లు తీసుకునేందుకు సిద్ద‌మౌవుతున్న‌ ఐసీసీ..?

రాష్ట్ర‌ప‌తి చేతుల మీదుగా ష‌మీ అర్జున అవార్డును అందుకున్న వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. నెటిజ‌న్లు పెద్ద ఎత్తున ష‌మీకి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ష‌మీ ప్ర‌స్తుతం చీల‌మండ గాయంతో బాధ‌ప‌డుతున్నాడు. ఈ క్ర‌మంలో వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ అనంత‌రం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆసీస్‌తో టీ20 సిరీస్‌తో పాటు ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు దూరంగా ఉన్నాడు. ఇంకా ఫిట్‌నెస్ సాధించ‌క‌పోవ‌డంతో అఫ్గానిస్థాన్‌తో జ‌న‌వ‌రి 11 నుంచి ఆరంభం కానున్న మూడు మ్యాచుల టీ20 సిరీస్ సైతం ఆడ‌డం లేదు.

IND vs AFG : భార‌త్ వ‌ర్సెస్ అఫ్గానిస్తాన్ టీ20 సిరీస్‌.. మ్యాచుల‌ను ఫ్రీగా ఎక్క‌డ ఎలా చూడొచ్చో తెలుసా..?

తన గాయం గురించి ష‌మీ స్పందించాడు. ఆట‌లో గాయాలు స‌హ‌జ‌మేన‌ని చెప్పాడు. ప్ర‌స్తుతం కోలుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు. నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీ (ఎన్‌సీఏ)లోని వైద్య బృందం త‌న పురోగ‌తిపై సంతృప్తిగానే ఉంద‌న్నాడు. ట్రైనింగ్ సెష‌న్స్ మొద‌లుపెట్టిన‌ట్లు వెల్ల‌డించారు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌తో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అవుతున్న‌ట్లు తెలిపాడు.

ట్రెండింగ్ వార్తలు