IND vs WI 1st ODI Match
Mohammed Siraj: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య వన్డే సమరం ఈరోజు నుంచి ప్రారంభంకానుంది. మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి 7గంటలకు బార్బడోస్‌లో కెన్సింగ్టన్ ఓవల్‌లో జరుగుతుంది. ఇప్పటికే టెస్టు సిరీస్‌లో భాగంగా ఇండియా, విండీస్ జట్లు రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడాయి. 1-0 తో భారత్ జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. నేటినుంచి జరిగే వన్డే సిరీస్‌లో మూడు మ్యాచ్‌లను గెలుచుకొని వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని రోహిత్ సేన పట్టుదలతో ఉంది. అయితే, మరికొద్ది గంటల్లో తొలి వన్డే మ్యాచ్ ప్రారంభమవుతుందనుకుంటున్న సమయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఫాస్ట్ బౌలర్‌ను వన్డే సిరీస్ నుంచి పక్కకు తప్పించింది.
వెస్టిండీస్ తో వన్డే సిరీస్ నుంచి మహ్మద్ సిరాజ్ ను తప్పిస్తున్నట్లు బీసీసీఐ అధికారిక ట్విటర్ ఖాతాలో తెలిపింది. కారణాన్నికూడా బీసీసీఐ వివరించింది. సిరాజ్ చీలమండ నొప్పితో బాధపడుతున్నట్లు ఫిర్యాదు చేశాడని, ముందు జాగ్రత్త చర్యగా బీసీసీఐ వైద్య బృందం అతన్ని పరీక్షించి విశ్రాంతి తీసుకోవాలని సూచించిందని బీసీసీఐ ట్విటర్ ఖాతాలో పేర్కొంది. మరికొద్ది నెలల్లో స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సిరాజ్ ను వెస్టిండీస్, భారత్ వన్డే సిరీస్ నుంచి విశ్రాంతినివ్వడం జరిగిందని బీసీసీఐ తెలిపింది.
Team india: హైదరాబాద్‌లో రెండు మ్యాచ్‌లు, విశాఖలో రెండు మ్యాచ్‌లు.. తేదీలు ప్రకటించిన బీసీసీఐ ..
వెస్టిండీస్‌తో రెండో టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో మహ్మద్ సిరాజ్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. గతకొంత కాలంగా నిర్విరామంగా సిరాజ్ క్రికెట్ ఆడుతున్నాడు. సీనియర్లు బుమ్రా, షమీ గైర్హాజరీతో అన్ని ఫార్మాట్ లలో సిరాజ్ ఆడుతూ వస్తున్నాడు. సిరాజ్ సిరీస్ నుంచి తప్పుకోవటంతో అతని స్థానంలో శార్దూల్, ఉమ్రాన్ మాలిక్, జైదేవ్ ఉనద్కత్ లలో ఎవరికి తుది జట్టులో అవకాశం కల్పిస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది.
UPDATE – Mohd. Siraj has been released from Team India’s ODI squad ahead of the three-match series against the West Indies.
The right-arm pacer complained of a sore ankle and as a precautionary measure has been advised rest by the BCCI medical team.
More details here… pic.twitter.com/Fj7V6jIxOk
— BCCI (@BCCI) July 27, 2023