Ind vs WI : మహ్మద్ సిరాజ్ కళ్లు చెదిరే క్యాచ్.. శుభ్‌మన్ గిల్ అదిరిపోయే డ్యాన్స్.. వీడియోలు వైరల్
హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ఓ కళ్లు చెదిరే క్యాచ్ అందుకోగా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ అదిరిపోయే స్టెప్పులు వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
- Thota Vamshi Kumar
- Updated on- July 13, 2023 / 04:22 PM IST
Mohammed Siraj-Shubman Gill
Ind vs WI 1ST Test : వెస్టిండీస్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో భారత జట్టు అదరగొడుతోంది. రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ఐదు వికెట్లతో సత్తా చాటడంతో విండీస్‌ను మొదటి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (40), రోహిత్ శర్మ (30) క్రీజులో ఉన్నారు. మొదటి రోజు ఆటలో అశ్విన్, యశస్వి మెరుపులు మాత్రమే కాదు మహ్మద్ సిరాజ్(Mohammed Siraj), శుభ్‌మన్‌గిల్ (Shubman Gill Dance) ల హైలైట్స్ కూడా ఉన్నాయి.
హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ఓ కళ్లు చెదిరే క్యాచ్ అందుకోగా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ అదిరిపోయే స్టెప్పులు వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
సిరాజ్ సింగిల్ హ్యాండ్ క్యాచ్..
విండీస్ ఇన్నింగ్స్‌లో 28వ ఓవర్‌ను రవీంద్ర జడేజా వేశాడు. ఆ ఓవర్లోని ఆఖరి బంతి వెస్టిండీస్ బ్యాటర్ బ్లాక్‌వుడ్ మిడాఫ్ మీదుగా బౌండరీ కొట్టేందుకు భారీ షాట్ ఆడాడు. అయితే.. బంతికి లాంగ్ మిడాఫ్‌లో ఎత్తుగా గాల్లోకి లేచింది. ఫీల్డింగ్ చేస్తున్న మహ్మద్ సిరాజ్ చాలా దూరం నుంచి వచ్చి ఆ బంతిని ఒంటి చేత్తో ఒడిసిపట్టుకున్నాడు. కాగా.. సిరాజ్ చేయి నేలను గట్టిగానే తాకడంతో నొప్పితో కొద్ది సేపు నేలపై అలాగే పడుకుండి పోయాడు. సిరాజ్ పట్టుకున్న ఈ అద్భుత క్యాచ్‌ను చూసిన బ్లాక్‌వుడ్, టీమ్ఇండియా ఆటగాళ్లు ఓ సెకన్ పాటు ఆశ్చర్యపోయారు.
ఫీల్డ్‌లో శుభ్‌మన్ డ్యాన్స్..
ఫీల్డింగ్‌లో శుభ్‌మన్ గిల్ డ్యాన్స్ చేసిన వీడియో కూడా వైరల్‌గా మారింది. వెస్టిండీస్ జట్టు 148 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. 63వ ఓవర్ పూర్తి అయ్యింది. విండీస్ బ్యాటర్లు ఎండ్స్ మారుతుండగా.. ఆ సమయంలో ఫార్వర్డ్ షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న శుభ్‌మన్ గిల్ బౌండరీ బయట నుంచి వినబడుతున్న మ్యూజిక్కు తగ్గట్లుగా అదిరిపోయే స్టెప్పులు వేశాడు. కోహ్లి చూస్తున్నప్పటికి గిల్ అలాగే డ్యాన్స్ చేశాడు. మొత్తానికి విండీస్ టూర్‌ను భారత ఆటగాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు.
WI vs IND : విరాట్ కోహ్లిని అత్యధిక సార్లు ఔట్ చేసిన వెస్టిండీస్ బౌలర్ ఎవరో తెలుసా..?
WI vs IND : వెస్టిండీస్‌పై టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్లు ఎవరో తెలుసా..?
