WI vs IND : విరాట్ కోహ్లిని అత్య‌ధిక సార్లు ఔట్ చేసిన వెస్టిండీస్ బౌల‌ర్ ఎవ‌రో తెలుసా..?

ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి (Virat Kohli ) గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అత‌డు బ్యాట్ ప‌ట్టి మైదానంలోకి దిగాడు అంటే ప‌రుగుల వ‌ర‌ద పారాల్సిందే. అయితే.. కోహ్లిని ఇబ్బంది పెట్టిన బౌల‌ర్లు ఉన్నారు తెలుసా.

WI vs IND : విరాట్ కోహ్లిని అత్య‌ధిక సార్లు ఔట్ చేసిన వెస్టిండీస్ బౌల‌ర్ ఎవ‌రో తెలుసా..?

Virat Kohli

Virat Kohli-WI vs IND : ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి (Virat Kohli ) గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అత‌డు బ్యాట్ ప‌ట్టి మైదానంలోకి దిగాడు అంటే ప‌రుగుల వ‌ర‌ద పారాల్సిందే. త‌న బ్యాటింగ్‌తో ఎంద‌రో బౌల‌ర్ల‌కు నిద్ర‌లేని రాత్రుళ్లు మిగిల్చాడు. అయితే.. కోహ్లిని ఇబ్బంది పెట్టిన బౌల‌ర్లు ఉన్నారు తెలుసా. అందులోనూ వెస్టిండీస్‌ (West Indies)కు చెందిన ముగ్గురు బౌల‌ర్లు ఉండ‌డం గ‌మ‌నార్హం.

విరాట్ కోహ్లి క‌రేబీయ‌న్ దీవుల‌తో ప్ర‌త్యేక అనుబంధం ఉంది. 2011లో జ‌మైకాలోనే విరాట్ టెస్టుల్లో అరంగ్రేటం చేశాడు. తొలి మ్యాచ్‌లో 4, 15 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. మొత్తంగా వెస్టిండీస్‌తో 14 టెస్టులు ఆడిన కోహ్లి 43.26 స‌గ‌టుతో 822 ప‌రుగులు చేశాడు. ఇందులో రెండు శ‌త‌కాలు, ఐదు అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. అత్య‌ధిక స్కోరు 200.

Virat Kohli : విరాట్ కోహ్లి ముంగిట అత్యంత అరుదైన రికార్డు.. విండీస్ తుది జ‌ట్టులో ఆ వ్య‌క్తి చోటు ద‌క్కించుకుంటేనే..!

ప్ర‌స్తుతం టీమ్ఇండియా వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న‌లో ఉంది. డొమినికా వేదిక‌గా నేటి(జూలై 12) నుంచి భార‌త్‌, వెస్టిండీస్ జ‌ట్లు తొలి టెస్టులో త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో విరాట్ కోహ్లి ఇబ్బందులు పెట్టిన ముగ్గురు వెస్టిండీస్ బౌల‌ర్లు ఎవ‌రో చూద్దాం.

ఫిడేల్ ఎడ్వర్డ్స్

మిగ‌తా వారితో పోలిస్తే విరాట్ కోహ్లి పై స‌క్సెస్ అయిన బౌల‌ర్ల‌లో ఫిడేల్ ఎడ్వర్డ్స్ మొద‌టి స్థానంలో ఉన్నాడు. కోహ్లి అరంగ్రేట సిరీస్‌లో రాణించ‌లేక‌పోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఎడ్వ‌ర్డ్స్ అని చెప్ప‌వ‌చ్చు. ఎడ్వ‌ర్డ్స్ బౌలింగ్‌లో 83 బంతులు ఎదుర్కొన్న కోహ్లి కేవ‌లం 30 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. మూడు సార్లు అత‌డి బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు.

WI vs IND : వెస్టిండీస్‌తో మొద‌టి టెస్టు.. ఓపెన‌ర్‌గా య‌శ‌స్వి జైశ్వాల్‌.. గిల్ మాటేమిటి..? పుజారా స్థానంలో ఎవ‌రు..?

షేన్ షిల్లింగ్‌ఫోర్డ్

రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ జ‌ట్టు భార‌త దేశానికి వ‌చ్చింది. ఆ సిరీస్ స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఆఖ‌రిది అన్న సంగ‌తి తెలిసిందే. ఆ సిరీస్‌లో ఆఫ్ స్పిన్న‌ర్ అయిన షేన్ షిల్లింగ్‌ఫోర్డ్ కోహ్లిని ఇబ్బంది పెట్టాడు. అత‌డి బౌలింగ్‌లో 48 బంతులు ఎదుర్కొన్న విరాట్‌ 30 ప‌రుగులు చేశాడు. అయితే.. రెండు సార్లు అత‌డి బౌలింగ్‌లోనే ఔట్ అయ్యాడు. కాగా.. ప్ర‌స్తుత సిరీస్‌లో కోహ్లి స్పిన్న‌ర్ల‌ను ఎలా ఎదుర్కొంటాడు అన్నది ఆస‌క్తిక‌రంగా మారింది.

జాసన్ హోల్డర్

టెస్టుల్లో కోహ్లిని రెండు సార్లు ఐదుగురు వెస్టిండీస్ బౌల‌ర్లు ఔట్ చేశారు. అయితే.. మిగిలిన వారితో పోలిస్తే జాస‌న్ హోల్డ‌ర్ స‌గ‌టు ఉత్త‌మంగా ఉంది. త‌న ఎత్తును ఉప‌యోగించుకుని హోల్డ‌ర్ అద‌న‌పు బౌన్స్‌ను రాబ‌డ‌తాడు. అంతేకాకుండా బంతిని స్వింగ్ చేయ‌గ‌ల సామ‌ర్థ్యం అత‌డి సొంతం. ఇప్ప‌టి వ‌ర‌కు టెస్టుల్లో హోల్డ‌ర్ 144 బంతుల‌ను కోహ్లికి సంధించాడు. 69 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చాడు. రాబోయే సిరీస్‌లో వీరిద్ద‌రి మ‌ధ్య పోటీ ఆస‌క్తిక‌రంగా ఉంటుంది అన‌డంలో సందేహం లేదు.

WI vs IND : వెస్టిండీస్‌తో మొద‌టి టెస్టు.. అశ్విన్‌ను ఊరిస్తున్న అరుదైన రికార్డు.. మూడు అడుగుల దూరంలో..