WI vs IND : వెస్టిండీస్‌తో మొద‌టి టెస్టు.. అశ్విన్‌ను ఊరిస్తున్న అరుదైన రికార్డు.. మూడు అడుగుల దూరంలో..

వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న‌లో టీమ్ఇండియా తొలి పోరుకు సిద్ద‌మైంది. డొమినికా వేదిక‌గా భార‌త్‌, వెస్టిండీస్ జ‌ట్ల మ‌ధ్య బుధ‌వారం నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. మొద‌టి టెస్టు ముంగిట ర‌విచంద్ర‌న్ అశ్విన్ (Ravichandran Ashwin) ను ఓ రికార్డు ఊరిస్తోంది.

WI vs IND : వెస్టిండీస్‌తో మొద‌టి టెస్టు.. అశ్విన్‌ను ఊరిస్తున్న అరుదైన రికార్డు.. మూడు అడుగుల దూరంలో..

Ravichandran Ashwin

West Indies vs India : వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న‌లో టీమ్ఇండియా తొలి పోరుకు సిద్ద‌మైంది. డొమినికా వేదిక‌గా భార‌త్‌, వెస్టిండీస్ జ‌ట్ల మ‌ధ్య బుధ‌వారం నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఇరు జ‌ట్ల‌కు ఈ మ్యాచ్‌తోనే 2023-25 ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ (WTC) సైకిల్ ప్రారంభం కానుంది. కాగా.. మొద‌టి టెస్టు ముంగిట ర‌విచంద్ర‌న్ అశ్విన్ (Ravichandran Ashwin) ను ఓ రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో గ‌నుక అశ్విన్ మూడు వికెట్లు తీసిన‌ట్ల‌యితే 700 వికెట్ల క్ల‌బ్‌లో అడుగుపెడ‌తాడు.

Virat Kohli : విరాట్ కోహ్లి ముంగిట అత్యంత అరుదైన రికార్డు.. విండీస్ తుది జ‌ట్టులో ఆ వ్య‌క్తి చోటు ద‌క్కించుకుంటేనే..!

ఇప్ప‌టి వ‌ర‌కు అశ్విన్ మూడు ఫార్మాట్ల‌లో క‌లిపి 270 మ్యాచులు ఆడాడు. 697 వికెట్లు నేల‌కూల్చాడు. మ‌రో మూడు వికెట్లు తీస్తే ఏడు వంద‌ల వికెట్లు మైలురాయిని అందుకుంటాడు. వాస్త‌వానికి డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ మ్యాచ్‌లోనే ఈ మైలురాయిని చేరుకునే అవ‌కాశం ఉండ‌గా.. ఆ మ్యాచ్ తుది జ‌ట్టులో అశ్విన్‌కు చోటు ద‌క్క‌లేదు. భీక‌ర ఫామ్‌లో ఉన్న అశ్విన్ విండీస్‌తో మొద‌టి టెస్టులోనే ఈ మైలు రాయిని చేరుకునే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి.

మూడో బౌల‌ర్‌గా..

అశ్విన్ మూడు వికెట్లు తీస్తే 700 వికెట్లు తీసిన మూడో భార‌త బౌల‌ర్‌గా రికార్డుల‌కు ఎక్క‌నున్నాడు. టీమ్ఇండియా త‌రుపున ఇప్ప‌టి వ‌ర‌కు ఇద్ద‌రు బౌల‌ర్లు మాత్ర‌మే ఏడు వంద‌ల‌కు పైగా వికెట్లు ప‌డ‌గొట్టారు. అనిల్ కుంబ్లే (Anil Kumble) 956 వికెట్ల‌తో మొద‌టి స్థానంలో ఉండ‌గా హ‌ర్భ‌జ‌న్ సింగ్ (Harbhajan Singh) 711 వికెట్ల‌తో రెండో స్థానంలో కొన‌సాగుతున్నాడు. ఇక ఓవ‌రాల్‌గా ఈ మైలురాయిని అందుకున్న 16వ బౌల‌ర్‌గా నిల‌వ‌నున్నాడు.

WI vs IND : వెస్టిండీస్‌పై టెస్టుల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన భార‌త బ్యాట‌ర్లు ఎవ‌రో తెలుసా..?

ఇక వెస్టిండీస్ పై అశ్విన్ కు మంచి రికార్డు ఉంది. ఆ జ‌ట్టుతో ఇప్ప‌టి వ‌ర‌కు 11 టెస్టులు ఆడిన అశ్విన్ 60 వికెట్లు తీయ‌డంతో పాటు 552 ప‌రుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో అశ్విన్ పేరిట ఐదు శ‌త‌కాలు ఉన్నాయి. ఇందులో నాలుగు సెంచ‌రీలు వెస్టిండీస్‌పైనే చేయ‌డం గ‌మ‌నార్హం. ఇక వెస్టిండీస్‌లో నాలుగు టెస్టులు ఆడిన అశ్విన్ 17 వికెట్లు ప‌డ‌గొట్టాడు. బెస్ట్ 7/83. అశ్విన్ కాస్త క‌ష్ట‌ప‌డితే హ‌ర్భ‌జ‌న్ సింగ్ రికార్డును బ్రేక్ చేయ‌వ‌చ్చు.