Mohd Rizwan
ఛాంపియన్స్ ట్రోఫీలో తమ జట్టు గెలుస్తుందన్న ధీమా వ్యక్తం చేశాడు పాకిస్థాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్. బాబర్ ఆజం ఓపెనర్‌గా దిగుతాడా అన్న విషయంపై కూడా అతడు క్లారిటీ ఇచ్చాడు.
రిజ్వాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బాబర్ ఆజం ఓపెనర్‌గానే ఆడతాడని క్లారిటీ ఇచ్చాడు. తమకు చాలా ఆప్షన్లు ఉన్నాయని, కాంబినేషన్లకు తగ్గ కూర్పుతోనే తుది జట్టు ఉంటుందని తెలిపాడు.
ఈ ట్రోఫీలోనూ బాబర్ ఆజం ఓపెనర్‌గా దిగుతాడని చెప్పాడు. దీనిపై బాబర్ అజాం సంతృప్తిగానే ఉన్నట్లు తెలిపాడు. ప్రత్యేకతలు కలిగిన ఓపెనర్లతోనే ఆడాలని తమలోనూ ఉందని, కానీ కాంబినేషన్ కోసం పలుసార్లు సడలింపులు ఉంటాయని చెప్పాడు.
Also Read: మహాకుంభ మేళాలో సతీసమేతంగా పవన్ కల్యాణ్ పుణ్యస్నానం.. జంధ్యంతో ఉన్న ఫొటోలు వైరల్
ఈ కారణం వల్లే బాబర్ ఆజంను ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఓపెనర్‌గా దింపుతున్నట్లు తెలిపాడు. మరో ఓపెనర్‌గా ఫఖర్ జమాన్ క్రీజులోకి ఇస్తాడని అన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో జట్టు విజయం సాధించేందుకు టీమ్‌లో అందరూ కఠినంగా శ్రమిస్తున్నారని తెలిపాడు. తాను సారధిగా టీమ్ సమష్టి ప్రదర్శన చేసి విజయం సాధిస్తే తనకు నచ్చుతుందని అన్నాడు.
పలు మ్యాచ్‌లలో పర్సనల్ పెర్ఫార్మన్స్ చాలా ప్రభావం చూపుతుందని తెలిపాడు. తమ టీమ్‌లో అందరూ సారధులేనని, తాను ప్రతినిధిగా టాస్ సమయంలో ఉంటానని, అలాగే ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడతానని చెప్పాడు. కాగా, ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌తో పాకిస్థాన్ ఫిబ్రవరి 23న మ్యాచ్ ఆడనుంది.