Most runs for team India in ICC T20 World Cup history
Team India : ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభం కానుంది. భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఈ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇక ఈ మెగాటోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా భారత్ అడుగుపెడుతోంది. స్వదేశంలో జరుగుతుండడంతో మరోసారి విజేతగా నిలిచి చరిత్ర సృష్టించాలని భారత జట్టు భావిస్తోంది.
ఇప్పటి వరకు 9 సార్లు టీ20 ప్రపంచకప్ జరిగింది. ప్రస్తుత ఎడిషన్ 10వది కావడం విశేషం. భారత్, వెస్టిండీస్, ఇంగ్లాండ్‌లు తలా రెండేసి సార్లు టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడాయి. పాకిస్తాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లు ఒక్కొసారి కప్పును సొంతం చేసుకున్నాయి.
T20 World Cup 2026 : దక్షిణాఫ్రికాతో భారత్ ఢీ.. ఎక్కడ చూడొచ్చొ తెలుసా?
ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు పొట్టి ప్రపంచకప్ చరిత్రలో భారత్ తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు ఎవరో ఓ సారి చూద్దాం..
విరాట్ కోహ్లీ..
భారత్ తరుపున టీ20 ప్రపంచకప్‌లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడి రికార్డు విరాట్ కోహ్లీ పేరిటే ఉంది. 2012 నుంచి 2024 వరకు టీ20 ప్రపంచకప్‌లలో మొత్తంగా 35 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 128.81 స్ట్రైక్‌రేటు 58.72 సగటుతో 1292 పరుగులు సాధించాడు.
రోహిత్ శర్మ..
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. 2007 నుంచి 2024 వరకు అన్ని టీ20 ప్రపంచకప్‌లలో పాల్గొన్న హిట్‌మ్యాన్ 47 మ్యాచ్‌ల్లో 34.85 సగటుతో 1220 పరుగులు సాధించాడు.
ఇక ఈ జాబితాలో ధోని, యువరాజ్, గంభీర్ తదితరులు ఉన్నారు.
టీ20 ప్రపంచకప్ టోర్నీ చరిత్రలో భారత్ తరుపున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లు వీరే..
* విరాట్ కోహ్లీ – 35 మ్యాచ్‌ల్లో 1292 పరుగులు
* రోహిత్ శర్మ – 47 మ్యాచ్‌ల్లో 1220 పరుగులు
* యువరాజ్ సింగ్ – 31 మ్యాచ్‌ల్లో 593 పరుగులు
* ఎంఎస్ ధోని – 33 మ్యాచ్‌ల్లో 529 పరుగులు
* గౌతమ్ గంభీర్ – 21 మ్యాచ్‌ల్లో 524 పరుగులు
* సూర్యకుమార్ యాదవ్ – 18 మ్యాచ్‌ల్లో 480 పరుగులు
* సురేశ్ రైనా – 26 మ్యాచ్‌ల్లో 453 పరుగులు