టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ.. మిస్టర్ కూల్ ఎప్పుడు ఆహ్లాదకరంగా కనిపిస్తాడు. మైదానంలో ఉన్నా.. ఇంట్లో ఉన్నా.. ఎక్కడైనా తనదైన శైలిలో అందరిని ఆకట్టుకుంటాడు.
టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ.. మిస్టర్ కూల్ ఎప్పుడు ఆహ్లాదకరంగా కనిపిస్తాడు. మైదానంలో ఉన్నా.. ఇంట్లో ఉన్నా.. ఎక్కడైనా తనదైన శైలిలో అందరిని ఆకట్టుకుంటాడు. మ్యాచ్ మధ్యలో తనతో సెల్ఫీ దిగేందుకు వచ్చిన అభిమానులతో కూడా ధోనీ సరదాగా ఆటపట్టిస్తుంటాడు. అంతేకాదు.. తన గారాల పట్టి జీవాతో కూడా ఎంతో సరదాగా ధోనీ గడుపుతుంటాడు. తన కుమార్తెను ఆడిస్తున్న వీడియోలు ఎన్నో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఈసారి ధోనీ తన కుమార్తె జీవాకు లాంగ్వేజ్ పాఠాలు బోధిస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఈ వీడియోను సూపర్ కింగ్స్ రీట్వీట్ చేసింది.. ఎప్పుడు సిక్సర్ తో చెలరేగే అప్పా.. మ్యాచ్ ల మధ్య కూతురికి ల్వాంగేజ్ పాటలు నేర్పిస్తున్నాడు ’#WhistlePodu #Yellove VC: @msdhoni అంటూ ట్వీట్ పెట్టింది. ఐపీఎల్ 2019 సీజన్ మొదలయింది. చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనిగ్ మ్యాచ్ జరిగింది. ఈ ఆరంభ మ్యాచ్ లో చెన్నై శుభారంభం చేసింది. బెంగళూరుపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కుమార్తె జీవాకు ధోనీ ల్వాంగేజ్ పాఠాలు ఏంటో మీరూ కూడా చూసి ఎంజాయ్ చేయండి..
Always a sixer with Appa! Language lessons between matches! #WhistlePodu #Yellove ??
VC: @msdhoni pic.twitter.com/fUXqE0dUyi— Chennai Super Kings (@ChennaiIPL) March 24, 2019