MS Dhoni has been fined Rs 1000 after his vehicle was caught overspeeding in Ranchi
MS Dhoni : రాంచీలో అతివేగంగా వాహనం నడుపుతూ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి రూ.1000 జరిమానా పడింది. మోటారు వాహనాల చట్టం సెక్షన్ 183 కింద ఈ-చలాన్ ను జారీ చేశారు.
రాంచీలోని ఆయన నివాసం సమీపంలోని ఆటోమేటెడ్ సీసీ కెమెరా ధోని వాహనం నిర్దిష్ట వేగం కన్నా ఎక్కువగా ప్రయాణిస్తున్నట్లు గుర్తించింది. వెంటనే డిజిటల్ చలాన్ ను రూపొందించాయి. ఇది చిన్న నేరమే అయినప్పటికి కూడా ధోనికి సంబంధించినది కావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Team India : చంద్రగ్రహణం ఎఫెక్ట్ టీమ్ఇండియా పై కూడా పడింది..! హార్దిక్ పాండ్యా 2 గంటలకు పైగా..
ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ మొదలెట్టిన ధోని..
మార్చి నెలాఖరులో ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం కానుంది. కాగా.. ఈ సీజన్ కోసం ధోని ఇప్పటికే ప్రాక్టీస్ మొదలెట్టాడు. చెన్నైకి చేరుకున్న అతడు సీఎస్‌కే శిక్షణా కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్నాడు. నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చుతున్నాడు.
🦁🔥 miROARing! 🔥🦁 #WhistlePodu #Yellove pic.twitter.com/jM0X9rmMci
— Chennai Super Kings (@ChennaiIPL) March 1, 2026
ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2025 సీజన్‌లో పేలవ ప్రదర్శన చేసింది. 14 మ్యాచ్‌లు ఆడగా నాలుగు మ్యాచ్‌ల్లో మాత్రమే గెలుపొందింది. 10 మ్యాచ్‌ల్లో ఓడిపోయి పాయింట్ల పట్టికలో చివరి స్థానంతో సీజన్‌ను ముగించింది. కాగా.. ఐపీఎల్ 2026 వేలంలో పలువురు ఆటగాళ్లు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2026 సీజన్‌లో బలమైన ప్రదర్శన చేయాలని చూస్తోంది.
అన్‌క్యాప్డ్ ప్లేయర్ రూల్ ప్రకారం ధోనిని సీఎస్‌కే రూ.4 కోట్లకు నిలుపుకుంది. ఐపీఎల్ 2026 సీజన్‌లోనూ ధోని ఆఖరి ఓవర్లలో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. ఐపీఎల్ 2025 సీజన్‌లో ధోని 135.17 స్ట్రైక్‌రేటుతో 196 పరుగులు చేశాడు.