MS Dhoni
MS Dhoni : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్‌కు సంబంధించిన ప్రక్రియ మొదలైంది. ఇప్పటి నుంచే అన్ని ఫ్రాంచైజీలు ఐపీఎల్ 2024లో విజేతగా నిలిచేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకునే పనిలో పడ్డాయి. దుబాయ్ వేదికగా డిసెంబర్ 19న జరిగిన మినీ వేలంలో ఫ్రాంచైజీలు తమ ప్రణాళికలకు అనుగుణంగా ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. కాగా.. ఇప్పుడు అందరి దృష్టి చెన్నై సూపర్ కింగ్స్ పైనే పడింది.
ఆగస్టు 15, 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన మహేంద్ర సింగ్ ధోని ప్రస్తుతం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. ఈ క్రమంలో వచ్చే సీజనే అతడి ఆఖరి సీజన్ అని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ధోనికి ఓ ప్రశ్న ఎదురైంది. క్రికెట్ నుంచి పూర్తిగా వైదొలిగాక ఏం చేస్తారని 42 ఏళ్ల ధోనిని ని అడుగగా.. అతడు చెప్పిన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారింది.
Hardik Pandya : ఎయిర్ పోర్టులో హార్దిక్ పాండ్యకు చేదు అనుభవం.. ‘ముంబైకా రాజా రోహిత్ శర్మ’
ఆ లోటును పూడ్చాల్సిన బాధ్యత ఉంది..
ఇప్పటి వరకు దాని గురించి తాను పెద్దగా ఎప్పుడూ ఆలోచించలేదని ధోని చెప్పాడు. తానింకా క్రికెట్ ఆడుతూనే ఉన్నానని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్‌లో ధోని చెన్నైకి ఆడుతుండడాన్ని ఇక్కడ ప్రస్తావించాడు. ఇక క్రికెట్ తరువాత ఏం చేయాలి అనేది ఆసక్తికరంగా ఉంటుందని, ఆర్మీకి కొంచెం ఎక్కువ సమయాన్ని కేటాయించాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలు ఆర్మీతో ఎక్కువగా ఉండలేకపోయానని, ఆలోటును పూడ్చాల్సిన బాధ్యత తనపై ఉందన్నాడు.
ఇదిలా ఉంటే.. భారత క్రికెట్‌కు మహేంద్ర సింగ్ ధోని అందించిన సేవలకు గాను 2011లో అతడికి భారత సైన్యంలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్‌ను అందించిన సంగతి తెలిసిందే. కాగా.. ధోని తరువాత చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎవరు కెప్టెన్‌గా వ్యవహరిస్తారు అన్న ప్రశ్న ప్రస్తుతం ఆ జట్టు అభిమానులను వేధిస్తోంది. 2022 సీజన్‌లో రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ అప్పగించినా అది బెడిసి కొట్టడంతో సీజన్ మధ్యలోనే తిరిగి ధోని నాయకత్వ బాధ్యతలు అందుకున్న సంగతి తెలిసిందే. ధోని సారథ్యంలోని చెన్నై జట్టు ఐదు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
Team India : మూడో వన్డేలో దీన్ని గమనించారా..? చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే ఇది సాధ్యం..!
After Cricket, i want to spend Bit More Time With the Army ❤️?#MSDhoni pic.twitter.com/6J7EaySSop
— Chakri Dhoni (@ChakriDhoni17) December 21, 2023