Team India : మూడో వన్డేలో దీన్ని గమనించారా..? చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే ఇది సాధ్యం..!
దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది.

Team India
Team India : దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. గురువారం పార్ల్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన ఆఖరి వన్డే మ్యాచులో టీమ్ఇండియా 78 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 296 పరుగులు చేసింది. భారత బ్యాటర్లో సంజు శాంసన్ (108; 114 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) వన్డేల్లో మొట్ట మొదటి శతకాన్ని అందుకున్నాడు. హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ (52; 77 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో మెరిశాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో బ్యురాన్ హెండ్రిక్స్ మూడు వికెట్లు తీశాడు. బర్గర్ రెండు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 45.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది. సఫారి బ్యాటర్లలో టోని జోర్జి (81; 87 బంతుల్లో 6ఫోర్లు, 3సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. మార్‌క్రమ్ (36; 41 బంతుల్లో 2ఫోర్లు, 1సిక్స్) రాణించగా మిగిలిన వారు విఫలం కావడంతో దక్షిణాఫ్రికాకు ఓటమి తప్పలేదు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ నాలుగు వికెట్లు తీశాడు. అవేశ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ చెరో రెండు వికెట్లు పడగొట్టాడు. ముకేశ్ కుమార్, అక్షర్ పటేల్‌లు ఒక్కొ వికెట్ సాధించారు.
Sanju Samson: సంజూ శామ్సన్ ఫస్ట్ వన్డే సెంచరీ.. చాలా కాలం గుర్తుంటుంది..
అరుదైన సందర్భం..!
కాగా.. ఈ మ్యాచులో భారత జట్టుకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదేమిటంటే.. తుది జట్టులో ఉన్న ప్రతి ఒక్క ఆటగాడు ఒక్కొ ఐపీఎల్ జట్టుకు చెందిన ఆటగాడు కావడం గమనార్హం. భారత తుది జట్టు ఎంపికకు ఐపీఎల్‌కు ఎలాంటి సంబంధం లేనప్పటికీ ప్రస్తుతం ఈ వార్త హల్ చల్ చేస్తోంది. చెన్నై మినహా మిగిలిన ఐపీఎల్ టీమ్‌ల నుంచి కనీసం ఒక్క ఆటగాడు అయినా తుది జట్టులో ఉన్నాడు. కాగా.. ఇలాంటిది ఎప్పుడో ఒక సారి జరుగుతుందని అంటున్నారు.
తుది జట్టులో ఉన్న ఆటగాళ్లు ఎవరంటే..?
రజత్ పటిదార్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు), సాయి సుదర్శన్ (గుజరాత్), సంజు శాంసన్ (రాజస్థాన్ రాయల్స్), తిలక్ వర్మ (ముంబై ఇండియన్స్), కేఎల్ రాహుల్ (లక్నో సూపర్ జెయింట్స్), రింకూ సింగ్ (కోల్‌కతా నైట్ రైడర్స్), వాషింగ్టన్ సుందర్ (సన్‌రైజర్స్ హైదరాబాద్), అక్షర్ పటేల్ (ఢిల్లి క్యాపిటల్స్), అర్ష్‌దీప్ సింగ్ (పంజాబ్ కింగ్స్), అవేశ్ ఖాన్ (రాజస్థాన్ రాయల్స్), ముకేశ్ కుమార్ (ఢిల్లి క్యాపిటల్స్)
Rarest time when there is at least one Player from each IPL team!!! ? pic.twitter.com/c8VB07Oa9E
— retired ICT fan (@ViratCrazyDK) December 21, 2023