ధోనీకి ICC Spirit of Cricket Award, ఎందుకిచ్చారు ? Nottingham Test లో ఏం జరిగింది ?

ICC Spirit of Cricket Award : టీమిండియా మాజీ కెప్టెన్ ముద్దుగా కూల్ గా పిలుచుకొనే..ధోని (MS Dhoni)కి ‘ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు’ ఎలా దక్కింది ? అసలు ఏ క్రీడాస్పూర్తి ప్రదర్శించారు ? అనేది అందరికీ డౌట్‌ రావొచ్చు. దీనిని తెలుసుకోవాలంటే…2011లో ఇంగ్లాండ్‌తో జరిగిన నాటింగ్ హోమ్ టెస్టు (Nottingham Test)లో ఇయాన్ బెల్ వివాదాస్పద రనౌట్ గురించి చెప్పాలి. ఇక్కడే మిస్టర్ కూల్ ధోని క్రీడా స్పూర్తిని ప్రదర్శించడం అందర్నీ ఆకట్టుకుంది. అభిమానులు మహీని ఏకగ్రీవింగా ఎన్నుకున్నారని ఐసీసీ వెల్లడించింది.

2011లో టీమిండియా ఇంగ్లాండ్‌లో పర్యటించింది. తొలి టెస్టులో 195 పరుగుల తేడాతో పరాజయం చెందింది. తర్వాత..నాటింగ్ హోమ్ టెస్టుకు రెడీ అయ్యింది. తొలి ఇన్నింగ్స్‌లో 221 పరుగులను ఇంగ్లాండ్ చేయగా..భారత్ 288 పరుగులు సాధించింది. తర్వాత..బ్యాటింగ్‌కు ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్స్ వచ్చారు. 544 పరుగుల భారీ స్కోరు సాధించి..భారత్‌కు 478 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్‌ మూడో రోజు ఆటలో ఇషాంత్ శర్మ బౌలింగ్ చేస్తున్నాడు. ఇయాన్ బెల్ (Bell) బ్యాటింగ్ చేస్తున్నాడు. డీప్ స్క్వేర్ లెగ్‌లో షాట్ కొట్టాడు. బౌండరీకి వేగంగా వెళుతున్న బంతిని ప్రవీణ్ కుమార్ ఆపడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే..మూడు పరుగులు పూర్తి చేశారు. బెల్, ఇయాన్ మోర్గాన్..లు బౌండరీగా భావించి..క్రీజు మధ్యలోనే ఉండిపోయారు.

అదే ఆఖరి బంతి కావడంతో…క్రీజులోకి వెళ్లకుండానే..మైదానాన్ని వీడటానికి (టీ బ్రేక్) బయలుదేరారు. డైవ్ చేస్తూ..బంతిని అందుకున్న ప్రవీణ్..త్రో విసిరాడు. దీనిని పట్టుకున్న అభినవ్ వికెట్లను బంతితో పడగొట్టాడు. అనంతరం రనౌట్ అంటూ…అప్పీల్ చేశాడు. అంపర్ థర్డ్ అంపైర్ కు అప్పీల్ చేశారు. దీనిని థర్డ్ అంపైర్ పరిశీలించారు. బంతి బౌండరీకి వెళ్లలేదని, నిబంధనల ప్రకారం…బెల్ రనౌట్‌గా ప్రకటించారు. దీనికి బెల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇక స్టేడియంలోని ప్రేక్షకులు..ఛీట్..ఛీట్ అంటూ నినాదాలు చేశారు. టీ విరామంలో…ఇంగ్లాండ్ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్, కోచ్ యాండీ ఫ్లవర్‌‌లిద్దరూ…ధోనీ వద్దకు వెళ్లారు. రనౌట్ అప్పీల్‌ను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. క్రీడాస్పూర్తితో దాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించారు. దీంతో బెల్ తిరిగి క్రీజులోకి వచ్చాడు.

అయితే..ఈ చర్చలన్నీ…బయటున్న ప్రేక్షకులకు, ఇతరులకు తెలియదు. బెల్ కూడా క్రీజులోకి రావడంతో అంపైర్లు కూడా షాక్ తిన్న పరిస్థితి నెలకొంది. మైదానంలోకి టీమిండియా వచ్చినప్పుడు చప్పట్లతో అభినందించారు. ఇంగ్లాండ్ జట్టు తమ డ్రెస్సింగ్ రూమ్‌లో నిల్చొని ధోనీ క్రీడాస్పూర్తిని గౌరవించించింది. ఈ మ్యాచ్‌లో భారత్ 319 పరుగుల తేడాతో పరాజయం చెందినా…ధోనీ ప్రదర్శించిన క్రీడాస్పూర్తి ఇప్పటికీ మరిచిపోలేదు..అవార్డు రావడం వెనుక ఇదంతా జరిగింది.

ట్రెండింగ్ వార్తలు