MS Dhoni : రిటైర్‌మెంట్ పై ధోని కీల‌క వ్యాఖ్య‌లు.. బంతి నా కోర్టులో లేదు.. జ‌ట్టుకు మేలు చేసేలా నిర్ణ‌యం..

టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు, చెన్నై సూప‌ర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని త‌న రిటైర్‌మెంట్ పై స్పందించాడు.

MS Dhoni opens up on IPL retirement possibility

MS Dhoni retirement : టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు, చెన్నై సూప‌ర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని త‌న రిటైర్‌మెంట్ పై స్పందించాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌కు నాలుగేళ్ల క్రిత‌మే వీడ్కోలు ప‌లికిన మ‌హేంద్రుడు ప్ర‌స్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌రుపున మాత్ర‌మే ఆడుతున్నాడు. గ‌త కొన్ని సీజ‌న్లుగా ధోనికి ఇదే చివ‌రి సీజ‌న్ అని ప్ర‌చారం జ‌రుగుతుండ‌గా.. అత‌డు మాత్రం ఇప్ప‌డు కాదంటూ ముందుకు సాగుతున్నాడు. గ‌త ఐపీఎల్ సీజ‌న్‌లో సొంత అభిమానుల స‌మ‌క్షంలో వీడ్కోలు ప‌ల‌కాల‌ని ఉంద‌ని చెప్పాడు.

ఐపీఎల్ 2025 సీజ‌న్‌కు ముందు ఈ ఏడాది చివ‌రిలో మెగా వేలం జ‌ర‌గ‌నుంది. ఈ క్ర‌మంలో ధోని రిటైర్‌మెంట్ పై మ‌రోసారి వార్త‌లు వ‌స్తున్నాయి. దీనిపై ఓ కార్య‌క్ర‌మంలో ధోని స్పందించాడు. ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన నిబంధ‌న‌లు, రిటెన్ష‌న్ పాల‌సీని బీసీసీఐ ప్ర‌క‌టించిన త‌రువాత ఐపీఎల్ ఆడాలా వ‌ద్దా అనే విష‌యం నిర్ణ‌యం తీసుకుంటాన‌ని చెప్పాడు. త‌న నిర్ణ‌యం ఏదీ అయిన‌ప్ప‌టికి కూడా అది జ‌ట్టుకు మేలు చేసేలా ఉంటుంద‌ని తెలిపాడు.

Viral Video : అంపైర్‌పై బ్యాట‌ర్‌ ప‌గ‌..! లాస్ట్ మ్యాచ్‌లో ఔట్ ఇచ్చాడా ఏందీ..?

ఐపీఎల్ 2025కి చాలా స‌మ‌యం ఉంద‌న్నాడు. ఆట‌గాళ్ల రిటెన్ష‌న్ విష‌యంలో బీసీసీఐ ఏం నిర్ణ‌యం తీసుకుంటుందోన‌ని అంతా ఎదురుచూస్తున్నామ‌న్నాడు. ప్ర‌స్తుతం బంతి త‌న ఆధీనంలో లేద‌ని, మెగా వేలానికి సంబంధించిన రూల్స్‌, నిబంధ‌న‌లు వ‌చ్చిన త‌రువాత ఐపీఎల్ 18వ సీజ‌న్ ఆడాలా వ‌ద్దా అన్న దానిపై నిర్ణ‌యం తీసుకుంటాన‌ని తెలిపాడు. తాను ఏ నిర్ణ‌యం తీసుకున్న‌ప్ప‌టికి కూడా అది జ‌ట్టుకు మేలు చేసేలా ఉంటుంద‌ని ధోని చెప్పాడు.

ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 2024 సీజ‌న్‌కు ముందు నాయ‌క‌త్వ బాధ్య‌త‌ల నుంచి ధోని త‌ప్పుకున్నాడు. ఓపెన‌ర్ రుతురాజ్ గైక్వాడ్‌కు ఆ బాధ్య‌త‌లు అప్ప‌గించాడు. రుతురాజ్ గైక్వాడ్ నాయ‌క‌త్వంలో చెన్నై ప్లే ఆఫ్స్ చేరుకోన‌ప్ప‌టికి కూడా మంచి ప్ర‌ద‌ర్శ‌న‌నే చేసింది. 14 మ్యాచుల్లో ఏడు మ్యాచుల్లో గెలిచి, మ‌రో ఏడు మ్యాచుల్లో ఓడింది. ర‌న్‌రేటులో కాస్త వెనుక‌బ‌డి పోవ‌డంతో ఐదో స్థానంలో నిలిచింది. లేదంటే ప్లే ఆఫ్స్‌కు వెళ్లేదే.

Paris Olympics 2024 : నిఖ‌త్ జ‌రీన్ ప‌త‌క ఆశ‌లు ఆవిరి.. ప్రిక్వార్ట‌ర్స్‌లోనే ముగిసిన తెలంగాణ బాక్స‌ర్ జ‌ర్నీ..

ట్రెండింగ్ వార్తలు