The Chase Teaser : యాక్ష‌న్ హీరోగా మారిపోయిన కెప్టెన్ కూల్.. ఛేజ్ టీజ‌ర్ అదుర్స్‌..

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసన్ బాలా కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన ది ఛేజ్ (The Chase teaser)టీజర్‌ను మాధ‌వ‌న్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

MS Dhoni R Madhavan join hands in Vasan Bala The Chase

The Chase Teaser : ఇన్నాళ్లు త‌న క్రికెట్‌తో అభిమానుల‌ను అల‌రించాడు టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని. తాజాగా స‌రికొత్త అవ‌తారంతో ఫ్యాన్స్ ను క‌నువిందు చేయ‌బోతున్నాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌కు ఐదేళ్ల కింద‌టే వీడ్కోలు ప‌లికిన ధోని ప్ర‌స్తుతం ఐపీఎల్‌లో మాత్ర‌మే ఆడుతున్నాడు. ఇక అత‌డు త్వ‌ర‌లోనే వెండితెర‌పై సంద‌డి చేయ‌బోతున్నాడు.

ప్ర‌ముఖ న‌టుడు మాధ‌వ‌న్ ఆదివారం (సెప్టెంబ‌ర్ 7న‌) షేర్ చేసిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసన్ బాలా కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన ది ఛేజ్ (The Chase teaser)టీజర్‌ను మాధ‌వ‌న్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

SA vs ENG : ‘ఇది నిజంగా సిగ్గు చేటు.. అందుకే మేం ఘోరంగా ఓడిపోయాం..’ ద‌క్షిణాఫ్రికా హెడ్ కోచ్ ఆవేద‌న‌..

ఈ టీజ‌ర్‌లో ధోనీ ఫుల్ యాక్షన్ రోల్‌లో కనిపించడంతో అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. కెప్టెన్ కూల్ కాస్తా యాక్షన్ హీరోలా మారిపోయాడ‌ని అంటున్నారు.

 

టీజ‌ర్‌లో.. ధోని, మాధ‌వ‌న్‌లు ఇద్ద‌రు నల్ల కళ్లద్దాలు పెట్టుకుని, చేతిలో గన్ పట్టుకుని బుల్లెట్ల వర్షం కురిపించారు. వీరిద్ద‌రు టాస్క్‌ఫోర్స్ ఆఫీస‌ర్స్‌గా క‌నిపిస్తున్నారు. ‘ఒక మిషన్. ఇద్దరు ధైర్యవంతులు. రెడీగా ఉండండి, ఒక యాక్షన్ ఛేజ్ ప్రారంభం కానుంది’ అని మాధ‌వ‌న్ ఈ వీడియో షేర్ చేస్తూ రాసుకొచ్చారు.

CPL 2025 : సీపీఎల్‌లో కీర‌న్ పొలార్డ్ ఊచకోత‌.. 6,6,6,6,6.. 4,4,4,4,4

అయితే ఇది మూవీనా, వెబ్ సిరీస్‌సా లేదా ఏదైనా యాడా అన్న‌ది ప్ర‌స్తుతానికి తెలియ‌రాలేదు. మ‌రికొన్ని రోజుల్లో దీనిపై ఓ స్ప‌ష్ట‌త రానుంది. ఏదీ ఏమైన‌ప్ప‌టికి ఈ వీడియో చూసిన ధోని ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.