CPL 2025 : సీపీఎల్‌లో కీరన్ పొలార్డ్ ఊచకోత.. 6,6,6,6,6.. 4,4,4,4,4
సీపీఎల్ 2025 (CPL 2025)లీగ్‌లో కీరన్ పొలార్డ్ విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు..

CPL 2025 Kieron Pollard Bring Up His 50 In 17 Balls
CPL 2025 : కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2025(CPL 2025)లో వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ బ్యాట్‌తో విధ్వంసం సృష్టిస్తున్నాడు. ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నా అతడు ఇప్పటికే రెండు మెరుపులు ఇన్నింగ్స్‌లు ఆడగా తాజాగా మరోసారి చెలరేగిపోయాడు.
ఆదివారం గయానా అమెజాన్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 17 బంతుల్లోనే అర్థశతకం బాదేశాడు. మొత్తంగా 18 బంతులను ఎదుర్కొన్న పొలార్డ్ 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 54 పరుగులతో అజేయంగా నిలిచాడు. సీపీఎల్‌లో పొలార్డ్‌కు ఇదే వేగవంతమైన హాఫ్ సెంచరీ కాగా.. ఈ లీగ్ చరిత్రలో మూడో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీగా నిలిచింది.
BCCI Bank Balance : బీసీసీఐ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా? 2019లో 6వేల కోట్లు ఉండగా..
సీపీఎల్‌లో అత్యధిక వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన రికార్డు ఆండ్రీ రస్సెల్ పేరిట ఉంది. రస్సెల్ 14 బంతుల్లో ఈ ఘనత సాధించాడు. ఆ తరువాత డుమిని రెండో స్థానంలో ఉన్నాడు. అతడు 15 బంతుల్లో సాధించాడు.
సీపీఎల్‌లో వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన ఆటగాళ్లు వీరే..
* ఆండ్రీ రస్సెల్ – 14 బంతుల్లో
* జేమీ డుమినీ – 15 బంతుల్లో
* కీరన్ పొలార్డ్ – 17 బంతుల్లో
* డేవిడ్ మిల్లర్ – 17 బంతుల్లో
* ఎవిన్ లూయిస్ – 17 బంతుల్లో
38 YEAR OLD KIERON POLLARD WITH A 17 BALL FIFTY IN THE CPL. 🤯pic.twitter.com/n6vL1boAOb
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 7, 2025
ZIM vs SL : శ్రీలంకకు బిగ్ షాక్.. రెండో టీ20లో జింబాబ్వే సంచలన విజయం..
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పొలార్డ్ విధ్వంసంతో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఆ తరువాత లక్ష్యాన్ని గయానా జట్టు 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి అందుకుంది. గయానా బ్యాటర్లలో షై హోప్ (53), షిమ్రాన్ హిట్‌మయర్ (49)లు రాణించారు.
కాగా.. ఇప్పటికే నైట్‌రైడర్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే.