టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. రిటైర్మెంట్ కు స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. దాంతో పాటుగా ‘నాపై మీరు చూపించిన ప్రేమ, సపోర్ట్ కు థ్యాంక్స్. ఆగష్టు 15 సాయంత్రం 7గంటల 29 నిమిషాలకు రిటైర్మెంట్ అయినట్లుగా భావించండంటూ దాంతో పాటు పోస్టు చేశారు. ఈ వీడియోలో తన కెరీర్ స్టార్టింగ్ నుంచి చివరి వరల్డ్ కప్ వరకూ లైఫ్ లో ఎదుర్కొన్న ప్రధాన ఘట్టాల ఫొటోలను వీడియో రూపంలో పేర్చి పోస్టు చేశారు.
మాజీ కెప్టెన్ ధోనీ.. బ్యాట్స్‌మన్ కంటే సెకన్ల వేగంతో అవుట్ చేయగల కీపింగ్ టెక్నిక్ తో ఫ్యామస్ అయ్యాడు. ఈ వీడియోలనూ ధోనీ కీపింగ్ చేస్తున్న ఫొటోనే ముందుగా వస్తుంది. చివరిగా ధోనీ నేల మీద పడుకుని అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు పలుకుతున్నట్లుగా మెసేజ్ ఇచ్చారు. ఇదిలా ఉంటే బ్యాక్ గ్రౌండ్ లో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన కభీ కభీ(1976) సినిమాలోని మై పల్ దో పల్ కా షాయర్ హూ అనే పాట వస్తుంది.
ఇక ఈ జార్ఖండ్ డైనమేట్, వికెట్ల వెనుక పాచికలు విసిరే చాణక్యుడు, టీమిండియాను నడిపించి గెలిపించిన నాయకుడ్ని ఐపీఎల్ లాంటి దేశీవాలీ లీగ్ లలో మాత్రమే చూడగలం.