Ms Dhoni
MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అధికారిక ట్విట్టర్ ఖాతాకు బ్లూ టిక్ మార్కును తొలగించింది ట్విట్టర్ సంస్థ. గతంలోనూ ఇలా కొందరు యూజర్లకు తొలగించినా కొంత విరామానికి పునరుద్ధరించింది. ధోనీ విషయంలో అలా జరగడం లేదంటూ రచ్ఛ చేశారు.
సోషల్ మీడియాకు దూరంగా ఉండే ధోనీ.. అప్పుడప్పుడు మాత్రమే ఏదో ఒక పోస్టు పెడుతుంటాడు. చివరిసారిగా ట్విట్టర్ లో జనవరి 8న మాత్రమే పోస్టు చేశాడు. ఆ కారణంగానే బ్లూ వెరిఫైడ్ బ్యాడ్జ్‌ను తొలగించి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఆరు నెలల పాటు అకౌంట్‌లో లాగిన్ కాకుంటే, అప్పుడు ట్విట్టర్ సంస్థ బ్లూ బ్యాడ్జ్ కోసం మళ్లీ వెరిఫికేషన్ కోరుతుంది.
ఇప్పటివరకు ధోనీ ఖాతాను 8.2 మిలియన్ల మంది ఫాలో అవుతుండటం విశేషం. జరగాల్సిన రచ్ఛ అంతా అయిపోయాక గానీ తిరిగి అతనికి బ్లూ టిక్ ను జతచేయలేదు ట్విట్టర్. ధోనీ 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి ఐపీఎల్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. మే 4న అర్ధాంతరంగా నిలిచిపోయిన ఐపీఎల్ 14వ సీజన్‌ను మళ్లీ సెప్టెంబర్-అక్టోబర్‌లో యూఏఈలోనే నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది.