MS Dhoni : ఎంఎస్ ధోనికి గాయం ? ఐపీఎల్ 2026 నుంచి త‌ప్పుకుంటాడా? ఆందోళ‌న‌లో ఫ్యాన్స్‌..

ప్రాక్టీస్ అనంత‌రం ధోని (MS Dhoni) డ్రెస్సింగ్ రూమ్‌కి వెలుతున్న ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

MS Dhoni was spotted limping after a practice session on the road to IPL 2026

MS Dhoni : మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 ప్రారంభం కానుంది. ఈ సీజ‌న్ ఆరంభానికి మ‌రో ఏడు రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. అయితే.. ఇప్పుడు చెన్నై సూప‌ర్ కింగ్స్ అభిమానుల‌ను ఓ టెన్ష‌న్ ప‌ట్టుకుంది. సీఎస్‌కే మాజీ కెప్టెన్ మోకాలిగాయంతో బాధ‌ప‌డుతున్న‌ట్లుగా తెలుస్తోంది. ప్రాక్టీస్ అనంత‌రం ధోని డ్రెస్సింగ్ రూమ్‌కి వెలుతున్న ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోలో ధోని కుంటుతూ వెళ్ల‌డం అభిమానుల‌ను ఆందోళ‌న‌కు గురి చేస్తోంది.

వాస్త‌వానికి ఐపీఎల్ 2023 నుంచి ధోనిని మోకాలి గాయం వేదిస్తోంది. ఐపీఎల్ 2023లో సీఎస్‌కే విజేత‌గా నిలిచి ఐదోసారి క‌ప్పును ముద్దాడింది. ఈ సీజ‌న్ ముగిసిన వెంట‌నే ధోని మోకాలికి శ‌స్త్ర‌చికిత్స చేయించుకున్నాడు. అయిన‌ప్ప‌టికి కూడా అత‌డిని మోకాలి స‌మ‌స్య ఇబ్బంది పెడుతూనే ఉంది. ఈ స‌మ‌స్య కార‌ణంగా అత‌డు వికెట్ల మ‌ధ్య వేగంగా ప‌రిగెత్త‌లేక‌పోతున్నాడు. ఈ నేప‌థ్యంలో అత‌డు ఇన్నింగ్స్ ఆఖ‌రి రెండు ఓవ‌ర్ల‌లో బ్యాటింగ్ కు వ‌స్తూ భారీ షాట్లు మాత్ర‌మే ఆడ‌డం గ‌త రెండు సీజ‌న్ల‌లో చూశాము.

IPL 2026 : కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌కు మ‌రో భారీ షాక్‌.. గాయంతో మ‌రో భార‌త పేస‌ర్ దూరం..!

ఐపీఎల్ మెగా వేలం 2026కు ముందు సీఎస్‌కే జ‌ట్టు సంజూ శాంస‌న్‌ను ట్రేడింగ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ నుంచి తీసుకుంది. ఇప్పుడు సంజూ శాంస‌న్ జ‌ట్టులో చేర‌డంతో ధోని తుది జ‌ట్టులో ఆడ‌తాడా? లేదా? అన్న‌ది చూడాలి. ఒక‌వేళ కీపింగ్ బాధ్య‌త‌ల‌ను సంజూకు అప్ప‌గించాల‌ని సీఎస్‌కే మేనేజ్‌మెంట్ నిర్ణ‌యిస్తే అప్పుడు ధోని ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా ఆడుతూ.. జ‌ట్టుకు ఫినిష‌ర్ అవ‌స‌రం అయిన‌ప్పుడు మాత్ర‌మే బ‌రిలోకి దిగే అవ‌కాశం ఉంది.

Suryakumar Yadav : నేను కెప్టెన్‌ను కాదు.. ఆ విషయం హార్దిక్‌ను అడ‌గాలి.. తిల‌క్ ప్ర‌శ్న‌పై సూర్య‌కుమార్ యాద‌వ్ హాట్ కామెంట్స్‌..

ఐపీఎల్ 2026లో సీఎస్‌కే జ‌ట్టు త‌మ తొలి మ్యాచ్‌ను మార్చి 30న రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో ఆడ‌నుంది. ఆ త‌రువాత ఏప్రిల్ 3న పంజాబ్ కింగ్స్‌, ఏప్రిల్ 5న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, ఏప్రిల్ 11న ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో ఆడ‌నున్నారు.