IMG credit @csk twitter
MS Dhoni – Vizag Groundsmen : విశాఖ వేదికగా ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 16 బంతులను ఎదుర్కొన్న ధోని నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు బాది 37 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఆట పాత కాలపు ధోని ని గుర్తు చేసింది. మహేంద్రుడు మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ కూడా చెన్నై ఈ మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. మ్యాచ్ అనంతరం ధోని చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మంచి పిచ్‌ను రూపొందించడంలో సాయపడిన విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియంలోని గ్రౌండ్ సిబ్బంది కోసం కొంత సమయాన్ని వెచ్చించాడు. వారితో కాసేపు కబర్లు ఆడి ఫోటోలు దిగాడు. భారత దిగ్గజ ఆటగాడు ధోనితో ఫోటో దిగడంతో గ్రౌండ్ సిబ్బంది ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోను సీఎస్‌కే తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది. మైదానంలో జ్ఞాపకాలు అంటూ ఆ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటో వైరల్‌గా మారింది.
Rohit Sharma : రోహిత్ శర్మ ఇలాంటి రికార్డు నీకు అవసరమా?
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 191 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (52), రిషబ్ పంత్ (51) హాఫ్ సెంచరీలు చేశారు. పృథ్వీ షా (43) రాణించాడు. లక్ష్య ఛేదనలో చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 171 పరుగులకే పరిమితమైంది. అజింక్య రహానె (45; 30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ధోనీ (37; 16 బంతుల్లో 4ఫోర్లు, 3సిక్సర్లు) ధాటిగా ఆడినప్పటికీ లక్ష్యాన్ని 20 పరుగుల దూరంలో చెన్నై ఆగిపోయింది. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్‌కుమార్ మూడు వికెట్లు, ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లతో రాణించారు.
In the ground of memories! ??️#DCvCSK #WhistlePodu #Yellove ?? pic.twitter.com/QNcOdBFt74
— Chennai Super Kings (@ChennaiIPL) March 31, 2024