Mujeeb Ur Rahman Hattrick Afghanistan Clinch T20I Series Win Over West Indies
AFG vs WI : వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే అఫ్గానిస్తాన్ జట్టు కైవసం చేసుకుంది. దుబాయ్ వేదికగా విండీస్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో అఫ్గాన్ 39 పరుగుల తేడాతో విజయం సాధించింది. అఫ్గాన్ విజయంలో ముజీబ్ ఉర్ రెహమాన్ కీలక పాత్ర పోషించాడు. హ్యాట్రిక్ తీయడంతో పాటు మొత్తంగా నాలుగు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల తేడాతో 189 పరుగులు చేసింది. అఫ్గాన్ బ్యాటర్లలో సెదిఖుల్లా అటల్ (53; 43 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు), డార్విష్ రసూలీ (68; 39 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు చేశారు. అజ్మతుల్లా ఒమర్జాయ్ (26 నాటౌట్; 13 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించాడు. విండీస్ బౌలర్లలో మాథ్యూ ఫోర్డ్ రెండు వికెట్లు తీశాడు.
Sunil Gavaskar : నాకు, అభిషేక్‌కు ఉన్న తేడా అదే.. సునీల్ గవాస్కర్ కామెంట్స్ వైరల్
High ✋s all around, as AfghanAtalan go 2-0 up, with a game to go! 👏#AfghanAtalan | #AFGvWI | #GloriousNationVictoriousTeam pic.twitter.com/QRg5LA69kA
— Afghanistan Cricket Board (@ACBofficials) January 21, 2026
ఆ తరువాత 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 18.5 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌటైంది. దీంతో అఫ్గాన్ 39 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. విండీస్ బ్యాటర్లలో కెప్టెన్ బ్రాండన్ కింగ్ (50; 41 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు), షిమ్రాన్ హెట్‌మయర్ (46; 17 బంతుల్లో 1 ఫోర్లు, 6 సిక్సర్లు) రాణించారు. మిగిలిన వారు ఘోరంగా విఫలం అయ్యారు. అఫ్గాన్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రెహమాన్ నాలుగు వికెట్లు తీశాడు. ఫజల్హాక్ ఫరూఖీ, అజ్మతుల్లా ఒమర్జాయ్ లు చెరో రెండు వికెట్లు తీశారు. రషీద్ ఖాన్ ఓ వికెట్ సాధించాడు.
𝐇𝐀𝐓-𝐓𝐑𝐈𝐂𝐊 𝐌𝐎𝐌𝐄𝐍𝐓𝐒! 🎩#AfghanAtalan | #AFGvWI | #GloriousNationVictoriousTeam @Mujeeb_R88 pic.twitter.com/diI9UynL3A
— Afghanistan Cricket Board (@ACBofficials) January 21, 2026