Mukul Choudhary : నేను పుట్టక ముందే నా క్రికెట్ ప్రయాణం మొదలైంది.. నాన్న కోరిక.. నాకు సరదా.. ముకుల్ చౌదరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో గురువారం అసాదారణ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు ముకుల్ చౌదరి(Mukul Choudhary).
- Thota Vamshi Kumar
- Published On : April 10, 2026 / 08:54 AM IST
Mukul Choudhary comments after player of the match received in IPL 2026 KKR vs LSG match (pic credit@ipl)
- కోల్‌కతాలో ముకుల్ చౌదరి విధ్వంసం
- ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం
- తన క్రికెట్ ప్రయాణం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు
Mukul Choudhary : కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో గురువారం అసాదారణ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు ముకుల్ చౌదరి. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు ఓటమి అంచుల్లో ఉన్నప్పుడు అసలేమాత్రం అంచనాలు లేకుండా మైదానంలోకి అడుగుపెట్టాడు. కేకేఆర్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ సంచలన ఇన్నింగ్స్‌తో లక్నో జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
182 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో జట్టు 128 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగుతోంది. ఈ దశలో ఏ మాత్రం అంచనాలు లేని ముకుల్ చౌదరి బరిలోకి దిగాడు. కేవలం 27 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 54 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో లక్నోకు నమ్మశక్యం కానీ విజయాన్ని అందించాడు. లక్నో విజయంలో కీలక పాత్ర పోషించడంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.
Rishabh Pant : ఇప్పుడు షమీ కుర్రాడేమీ కాదు.. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు..
నాన్న కోరిక..
ఈ అవార్డు అందుకున్న తరువాత ముకుల్ చౌదరి మాట్లాడుతూ తన క్రికెట్ ప్రయాణం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వాస్తవం చెప్పాలంటే తన ప్రయాణం తాను పుట్టక ముందే మొదలైందన్నాడు. తనను క్రికెటర్ చేయడం అనేది తన తండ్రి కల అని చెప్పుకొచ్చాడు. తాను పుట్టక ముందే ఇంకా చెప్పాలంటే తన తండ్రికి పెళ్లి కాకముందు నుంచే.. కొడుకును క్రికెటర్ చేయాలనే కల ఉండేదన్నారు.
ఆరంభంలో ఇంట్లో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేదన్నాడు. తనకు 12 -13 ఏళ్ల వయసు వచ్చినప్పటి నుంచి క్రికెట్ ఆడడం ప్రారంభించినట్లుగా చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో మా ఊరిలో ఎక్కువ క్రికెట్ అకాడమీలు లేవు. దీంతో జైపూర్‌కు మారాను. గత నాలుగు సంవత్సరాలుగా జైపూర్‌లోనే సాధన చేస్తున్నాను.
యూపీతో జరిగిన అండర్-19 మ్యాచ్‌లో తన ప్రదర్శన చూసి తాను తప్పకుండా క్రికెటర్‌ను అవుతానని నాన్న నమ్మారని చెప్పుకొచ్చాడు. అది లోస్కోరింగ్ మ్యాచ్. ఆ మ్యాచ్‌లో ఎవరూ సరిగ్గా ఆడలేదు. అయితే.. నేను పరుగులు చేశాను. దీంతో నేను ఉన్నత స్థాయికి చేరుకుంటానని నాన్నకు నమ్మకం కలిగింది అని ముకుల్ చౌదరి తెలిపాడు.
ఇక తనకు ఫ్లడ్‌లైట్ల కింద ఆడిన అనుభవం పెద్దగా లేదన్నాడు. తన క్రికెట్ కెరీర్‌లో ఫ్లడ్‌లైట్ల కింద ఆడిన రెండో మ్యాచ్ ఇదేనని తెలిపాడు. టీ20 మ్యాచ్‌ల్లో ఒత్తిడి సహజం అని, అయితే.. ఈ అవకాశాన్ని తాను ఒత్తిడిలా కాకుండా గోల్డోన్ ఛాన్స్‌లా చూశానని అన్నాడు. చివరి వరకు క్రీజులో ఉండాలనేది తన ప్రణాళిక అని చెప్పుకొచ్చాడు. తాను చివరి వరకు నాటౌట్‌గా ఉంటే ఖచ్చితంగా మ్యాచ్ గెలిపించగలను అనే నమ్మకం ఉందన్నాడు. బంతి నా జోన్‌లో పడితే బాదేస్తాను. సిక్సర్లు కొట్టడం అంటే తనకు ఎంతో సరదా అని అన్నాడు ముకుల్ చౌదరి.
