ఐపీఎల్ అరంగ్రేట మ్యాచ్ నుంచి అద్భుతాలు సృష్టించిన ముంబై ఇండియన్స్ బౌలర్ అల్జర్రీ జోసెఫ్ ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు.
ఐపీఎల్ అరంగ్రేట మ్యాచ్ నుంచి అద్భుతాలు సృష్టించిన ముంబై ఇండియన్స్ బౌలర్ అల్జర్రీ జోసెఫ్ ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ అయిన జోసెఫ్ భుజానికి తీవ్ర గాయమైంది. ఏప్రిల్ 13న రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌండరీకి వెళ్లబోతున్న బంతిని ఆపబోయి గాయానికి గురైయ్యాడు.
ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ జోసెఫ్ భుజంలో కీలు తప్పిందని అతనికి చికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలిపింది. ముంబై ఇండియన్స్ నుంచి కొద్ది కాలం ముందే న్యూజిలాండ్ ఫేసర్ ఆడం మిల్నేగాయం కారణంగా తప్పుకున్నాడు. అతని స్థానంలో ఏప్రిల్ 6న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అల్జెరీ జోసెఫ్ అడుగుపెట్టి గాయం కారణంగా జట్టును వీడాడు.
ఏప్రిల్ 15న జోసెఫ్ స్థానంలో లసిత్ మలింగను బరిలోకి దింపిన ముంబై ఇండియన్స్.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై 5వికెట్ల తేడాతో గెలిచింది. తర్వాతి మ్యాచ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై ఇండియన్స్ ఫిరోజ్ షా కోట్లా వేదికగా ఆడనుంది.
Read Also : ఒక్క మ్యాచ్ ఓడితే దారి మూసుకుపోయినట్లు కాదు: చాహల్