Courtesy BCCI
ఆరోసారి ఐపీఎల్ ట్రోపీని అందుకునేందుకు ముంబై ఇండియన్స్ రెండు అడుగుల దూరంలో ఉంది. శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజయం సాధించి క్వాలిఫయర్ -2కి అర్హత సాధించింది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. అయితే.. ఈ మ్యాచ్‌కు ముందు ముంబై క్వాలిఫయర్-2 రికార్డులు ఆ జట్టు అభిమానులను కాస్త కలవరపెడుతున్నాయి.
ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు నాలుగు సార్లు క్వాలిఫయర్-2 మ్యాచ్‌లను ఆడింది. ఇందులో రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, మరో రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. కాగా.. గెలిచిన రెండు సందర్భాల్లోనూ ఆ జట్టు టైటిల్ విజేతగా నిలవడం విశేషం. ఇక ఓడిన రెండు సందర్భాల్లోనూ ముంబై జట్టు ఎలిమినేటర్ ద్వారా క్వాలిఫయర్-2కు అర్హత సాధించడం గమనార్హం.
RCB : మీరు నమ్మగలరా? ఆర్‌సీబీ ఐపీఎల్ గెలిచింది.. డేల్ స్టెయిన్
2011 ఐపీఎల్‌లో తొలిసారి క్వాలిఫయర్-2లో ఆడిన ముంబై రాజస్థాన్ చేతిలో ఓడిపోయింది. ఈ సీజన్‌లో ఎలిమినేటర్ ద్వారా ముంబై క్వాలిఫయర్-2కి అర్హత సాధించింది. ఇక 2013లో క్వాలిఫయర్-1లో ఓడిపోయి క్వాలిఫయర్-2ను ఆడింది. అప్పుడు రాజస్థాన్ పై గెలిచి ఫైనల్‌కు చేరుకుని అక్కడ సీఎస్‌కేను ఓడించి టైటిల్‌ను ముద్దాడింది.
ఇక 2017లోనూ క్వాలిఫయర్-1లో ఓడిన ముంబై క్వాలిఫయర్-2లో కేకేఆర్ చిత్తు చేసి ఫైనల్‌కు దూసుకువెళ్లింది. అక్కడ రైజింగ్ పూణెను ఓడించి మరోసారి టైటిల్‌ను ముద్దాడింది. 2023 సీజన్‌లో ఎలిమినేటర్‌లో విజయం సాధించిన ముంబై.. క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ చేతిలో చిత్తైంది.
GT vs MI : అందువల్లే మేం ఓడిపోయాం.. లేదంటేనా.. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు..
పంజాబ్-ముంబై హెడ్-టు-హెడ్ రికార్డులు..
ఐపీఎల్‌లో ఇప్పటి వరకు పంజాబ్, ముంబై జట్టు 32 సందర్భాల్లో ముఖాముఖిగా తలపడ్డాయి. ఇందులో ముంబై జట్టు 17 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, పంజాబ్ 15 మ్యాచ్‌ల్లో గెలుపొందింది.