Pic: @IPL (X)
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ 45వ మ్యాచ్ జరిగింది. వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడ్డాయి. ఈ మ్యాచులో ముంబై ఇండియన్స్ 54 పరుగుల తేడాతో గెలుపొందింది.
మొదట బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు బ్యాటర్లలో రికెల్టన్, సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. రికెల్టన్ 58, రోహిత్ శర్మ 12, విల్ జాక్స్ 29, సూర్యకుమార్ యాదవ్ 54, తిలక్ వర్మ 6, హార్దిక్ పాండ్యా 5, నమన్ ధీర్ 25 (నాటౌట్), కార్బిన్ బాష్ 20, చాహర్ 11 ( నాటౌట్) పరుగులు చేశారు. దీంతో ముంబై స్కోరు నిర్ణీత 20 ఓవర్లలో 215/7గా నమోదైంది.
లక్నో జట్టులో మిచెల్ మార్ష్ 34, ఐడెన్ మార్క్రామ్ 9, నికోలస్ పూరన్ 27, రిషబ్ పంత్ 4, ఆయుష్ బడోని 35, డేవిడ్ మిల్లెర్క్ 24, అబ్దుల్ సమద్ 2, రవి బిష్ణోయి 13, అవేశ్ ఖాన్ 0, ప్రిన్స్ యాదవ్ 4 (నాటౌట్), దిగ్వేష్ సింగ్ 1 పరుగు చేశారు. దీంతో 20 ఓవర్లలో లక్నో 161 పరుగులకు ఆలౌట్ అయింది.
ముంబై ఇండియన్స్ జట్టు
ర్యాన్ రికెల్టన్, రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్, కార్బిన్ బాష్, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, కర్ణ్ శర్మ
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు
ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్, అబ్దుల్ సమద్, ఆయుష్ బడోని, దిగ్వేష్ సింగ్ రాఠీ, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్