ముంబై ఇండియన్స్ ఆటగాళ్ల భార్యల గురించి తెలుసా? వారందరూ వీరే.. ఎంతగా సపోర్ట్‌ చేస్తున్నారంటే?

ఆయా ఆటగాళ్ల భార్యలు ఏం చేస్తుంటారో తెలుసుకుందాం..

ముంబై ఇండియన్స్ ఆటగాళ్ల భార్యల గురించి తెలుసా? వారందరూ వీరే.. ఎంతగా సపోర్ట్‌ చేస్తున్నారంటే?

Updated On : April 27, 2025 / 4:45 PM IST

ఐపీఎల్‌ 2025లో ముంబై ఇండియన్స్‌ తొలుత వరుసగా ఓటములు ఎదుర్కొన్నప్పటికీ ఇటీవల జరిగిన నాలుగు మ్యాచుల్లో రాణించింది. మొత్తం 9 మ్యాచులు ఆడిన ముంబై జట్టు వాటిల్లో 5 మ్యాచుల్లో గెలిచి, 4 మ్యాచుల్లో ఓడిపోయింది. దీంతో ఆ జట్టు ఖాతాలో 10 పాయింట్లు ఉన్నాయి. పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. ప్లేఆఫ్ రేసులో గట్టిపోటీ ఇచ్చేలా కనపడుతోంది.

ముంబై ఇండియన్స్ ఆటగాళ్లకు వారి భార్యలు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. ముంబై ఆటగాళ్ల భార్యల గురించి తెలుసుకుందామా?
రోహిత్ శర్మ భార్య పేరు రితికా సజ్దే, జస్ప్రీత్ బుమ్రా భార్య సంజన గణేశన్, సూర్యకుమార్ యాదవ్ భార్య దేవిషా శెట్టి, ట్రెంట్ బౌల్ట్ పార్ట్నర్ గెర్ట్ స్మిత్, కర్ణ్ శర్మ భార్య నిధి శర్మ, దీపక్ చాహర్ భార్య జయ భరద్వాజ్, మిచెల్ శంట్నర్ పార్ట్నర్ కైట్లిన్, లిజాద్ విలియమ్స్ భార్య అడ్రి విలియమ్స్. ఆయా ఆటగాళ్ల భార్యలు ఏం చేస్తుంటారో తెలుసుకుందాం..

రితికా సజ్దేహ్ ​​- రోహిత్ శర్మ భార్య
రితికా సజ్దేహ్ ఓ సీజనల్ స్పోర్ట్స్ మేనేజర్. రోహిత్, రితికా 2015 లో వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. రితికా తరచుగా స్టేడియంలలో కనపడుతూ తన భర్తను సపోర్ట్ చేస్తుంది. రోహిత్‌ను ఉత్సాహపరుస్తుంది. ఈ జంట తరచుగా వారి కుటుంబ విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంటారు.

సంజన గణేషన్ – జస్ప్రీత్ బుమ్రా భార్య
సంజన గణేషన్ ప్రముఖ స్పోర్ట్స్ యాంకర్. 2021 మార్చిలో జస్ప్రీత్ బుమ్రా, సంజన్ వివాహం జరిగింది. సంజనకు ఐటీ, మోడలింగ్ నుంచి స్టార్ స్పోర్ట్స్‌తో స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టింగ్‌కు మారింది. ఐపీఎల్‌, ఐసీసీ వంటి ఈవెంట్‌లలో యాంకరింగ్ చేసింది.

దేవిషా శెట్టి – సూర్యకుమార్ యాదవ్ భార్య
దేవిషా ప్రొఫెషనల్ డ్యాన్స్ ఇన్‌స్ట్రక్టర్, కోచ్. దేవిషా శెట్టి 2010లో ఒక కాలేజీ ఈవెంట్‌లో తొలిసారి సూర్యకుమార్‌ను కలిసింది. 2016లో సూర్యకుమార్‌ను వివాహం చేసుకుంది.

గెర్ట్ స్మిత్ – ట్రెంట్ బౌల్ట్ పార్ట్నర్
రెర్ట్‌, బౌల్ట్ 2016 జూన్ లో నిశ్చితార్థం చేసుకున్నారు. అదే చివర్లో వివాహం చేసుకున్నారు. బౌల్ట్ ఒత్తిడిలో ఉన్న సమయంలో గెర్ట్ సపోర్టుగా నిలుస్తుంది. వీరికి ముగ్గురు కుమారులు బౌవీ, పార్కర్, చార్లీ ఉన్నారు. న్యూజిలాండ్‌లోని మౌంట్ మౌంగనుయ్‌లో ఈ కుంటుంబం ఉంటుంది.

నిధి శర్మ – కర్ణ్ శర్మ భార్య
కర్ణ్ శర్మ భార్య నిధి శర్మ బయట అంతగా కనపడదు. కర్ణ్ క్రికెట్ కెరీర్‌కి మాత్రం బాగా సపోర్ట్ చేస్తుంది. కర్ణ్ తన ఆటపై దృష్టి పెట్టడానికి వీలుగా నిధి నిర్ణయాలు తీసుకుంటోంది. బిజీ క్రికెట్ షెడ్యూల్లో ఉండే కర్ణ్‌కు అన్ని రకాలుగా సాయపడుతుందగి.

జయ భరద్వాజ్ – దీపక్ చాహర్ భార్య
దీపక్ చాహర్ భార్య జయ భరద్వాజ్ ఎయిర్‌టెల్ కంటెంట్ బిజినెస్ విభాగంలో పనిచేసేది. ఆమె మాస్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ చేసింది. జయ భరద్వాజ్‌ క్రికెట్‌ కెరీర్‌కి సపోర్టుగా నిలుస్తోంది.

కైట్లిన్ – మిచెల్ సాంట్నర్ పార్ట్నర్
మిచెల్ సాంట్నర్ పార్ట్నర్ కైట్లిన్ ఓ పర్యావరణ శాస్త్రవేత్త. ఆమె న్యూజిలాండ్ స్థానిక జంతు జాతులను, ప్రధానంగా పొడవాటి తోక ఉండే గబ్బిలాలను సంరక్షిస్తుంటుంది. ఏకాంతంగా ఉండడాన్ని ఇష్టపడుతుంది.

అడ్రి విలియమ్స్ – లిజాద్ విలియమ్స్ భార్య
లిజాద్ విలియమ్స్ 2021 మేలో అడ్రి విలియమ్స్‌ను వివాహం చేసుకున్నాడు. బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ గ్రాడ్యుయేట్ అయిన అడ్రి.. లిజాద్ కెరీర్‌కు బాగా సపోర్ట్ చేస్తుంది.