Mushfiqur Rahim bizarre dismissal : క్రికెట్‌లో అప్పుడప్పుడు బ్యాటర్లు విచిత్ర రీతిలో ఔట్ అవ్వడాన్ని చూస్తూనే ఉంటాం. తాజాగా బంగ్లాదేశ్ బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ (Mushfiqur Rahim) కూడా అలాగే ఔట్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్రికెట్‌లో ఫుట్‌బాల్ నైపుణ్యాలు అంటూ నెటీజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఎలా ఔట్ అయ్యాడంటే..
న్యూజిలాండ్ జట్టు ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉంది. మీర్పూర్ వేదికగా ఇరు జట్లు మూడో వన్డేలో తలపడుతున్నాయి. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. కివీస్ బౌలర్లు విజృంభించడంతో 35 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో సీనియర్ ఆటగాడు అయిన ముష్ఫికర్ రహీమ్ (18), నజ్ముల్ హుస్సేన్ శాంటో (76) శాంటోతో కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు.
కాగా.. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో 16వ ఓవర్‌ను కివీస్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ వేశాడు. మొదటి బంతిని ముష్ఫికర్ రహీమ్ డిఫెన్స్ ఆడాడు. అయితే.. ఆ బాల్ స్టెప్ పడి వికెట్ల వైపుగా వెళ్లింది. దీంతో తాను ఔట్ కాకూడదని భావించిన ముష్ఫికర్ బంతిని కాలుతో పక్కకు తన్నాలని ప్రయత్నించాడు. అయితే.. ఆ ప్రయత్నం విఫలమైంది. బంతి వికెట్లను గిరాటేయగా.. అతడి కాలు సైతం వికెట్లను తాకింది. దీంతో అతడు ఔట్ అయ్యాడు.
Smriti Mandhana : స్మృతి మంధాన కోసం 1200కి.మీ ప్రయాణించిన చైనా అభిమాని.. ఆమె ఓ దేవత..
ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముష్ఫికర్ రహీమ్ తన వికెట్ కాపాడుకోవడానికి క్రికెట్‌లో ఫుట్‌బాల్ నైపుణ్యాలను చూపించాడని, అయినప్పటికీ లాభం లేకపోయిందని కామెంట్లు పెడుతున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 34.3 ఓవర్లలో బంగ్లాదేశ్ 171 పరుగులకు ఆలౌటైంది.
Mushfiqur Rahim tries football skills to save his wicket, but couldn’t. pic.twitter.com/l7y2PxzoZJ
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 26, 2023