Gautam Gambhirm : గంభీర్ మీ నవ్వు బాగుంది.. నా భార్య కూడా ఎప్పుడూ ఇలా చెప్పలేదురా అయ్యా..
టీమ్ఇండియా మాజీ ఆటగాడు, కోల్‌కతా నైట్‌రైడర్స్ మెంటార్ గౌతమ్ గంభీర్‌ను ఎప్పుడూ చూసినా చాలా సీరియస్‌గానే కనిపిస్తుంటాడు.
- Thota Vamshi Kumar
- Published on- April 20, 2024 / 07:23 PM IST
My wife never told to me Gambhir after being told he has a lovely smile
Gautam Gambhirm Smile : టీమ్ఇండియా మాజీ ఆటగాడు, కోల్‌కతా నైట్‌రైడర్స్ మెంటార్ గౌతమ్ గంభీర్‌ను ఎప్పుడూ చూసినా చాలా సీరియస్‌గానే కనిపిస్తుంటాడు. మైదానంలోనైనా, బయటనైనా సరే అతడు నవ్వడాన్ని చాలా తక్కువ మందే చూసి ఉంటారు. అయితే.. తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్ షేర్ చేసిన వీడియోలో హోస్ట్ సైరస్ బ్రోచా.. గంభీర్ గురించి చెప్పిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
మెస్సీ, రొనాల్డో ఇద్దరిలో ఎవరు ఉత్తమ ఆటగాడు ఎవరు అని హోస్ట్ ప్రశ్నించగా.. అది చెప్పడం కష్టమనీ తనకు మాత్రం ఇంగ్లాండ్ ఆటగాడు మార్కస్ రాష్‌ఫోర్డ్ అంటే ఇష్టం అని గంభీర్ అన్నాడు. ఇప్పటి వరకు చూసినట్లయితే మీరు చాలా జోవియల్ మనిషిలా ఉన్నారు అని హోస్ట్ అనగా.. నా గురించి ఏమీ తెలియని వ్యక్తి సైతం నేను సీరియస్‌గా ఉండడాన్ని చూసి ఓ అంచనాకు వచ్చేస్తారు. ప్రజలు నా నవ్వు చూసేందుకు మ్యాచ్‌లు చూడరు. కేకేఆర్ విజయం సాధించడాన్ని చూసేందుకు ఇష్టపడతారు అని గంభీర్ అన్నాడు.
అది నిజమే కావొచ్చు.. అయితే.. మీ నవ్వు చాలా బాగుంది అని హోస్ట్ అనగా.. గంభీర్ ధన్యవాదాలు తెలియజేశాడు. నా భార్య కూడా ఎప్పుడూ కూడా నా నవ్వు బాగుందని చెప్పలేదు అంటూ గంభీర్ నవ్వేశాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది.
ఇదిలా ఉంటే.. గంభీర్ నాయకత్వంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. 2012, 2014లో ఐపీఎల్ ట్రోఫీలను అందుకుంది. ఇప్పటి వరకు మరోసారి కేకేఆర్ ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడలేదు. ఈ సీజన్‌కు ముందు కేకేఆర్ మెంటార్‌గా గంభీర్ నియమితులయ్యాడు. ఈ సీజన్లో కేకేఆర్ ఇప్పటి వరకు ఆరు మ్యాచులు ఆడగా నాలుగు మ్యాచుల్లో విజయం సాధించింది. రెండు మ్యాచుల్లో ఓడిపోయింది. 8 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో ఉంది.
Team India : టీ20 ప్రపంచకప్‌కు టీమ్ఇండియా ఎంపిక ఎప్పుడంటే?
