Shooter Damayanti Sen Missing : సరుకులు కొనేందుకెళ్లి .. జాతీయ స్థాయి యువ షూటర్ అదృశ్యం.. హౌరా స్టేషన్‌లో చివరిసారిగా..

Shooter Damayanti Sen Missing :పశ్చిమ బెంగాల్‌లో 15 ఏళ్ల జాతీయ స్థాయి షూటర్ అదృశ్యం కావడం కలకలం రేపింది. ఆమె కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

national level shooter damayanti sen goes missing last seen at howrah railway station west bengal

Shooter Damayanti Sen Missing :పశ్చిమ బెంగాల్‌లో 15 ఏళ్ల జాతీయ స్థాయి షూటర్ అదృశ్యం కావడం కలకలం రేపింది. హౌరాకు చెందిన దమయంతి సేన్ గురువారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత కనిపించకుండా పోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Also Read : FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్‌కప్‌ ఫైనల్‌‌కు డొనాల్డ్ ట్రంప్‌.. అయ్యో.. అర్జెంటీనాకు కొత్త టెన్షన్..

దమయంతి సేన్ జాతీయ జట్టు ట్రయల్స్‌కు ఎంపికైన ప్రతిభావంతమైన రైఫిల్ షూటర్. గురువారం మధ్యాహ్నం ఇంట్లో అవసరమైన కొన్ని వస్తువులు కొనుగోలు చేసేందుకు బయటకు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. బంధువులు, స్నేహితులు ఇండ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

అయితే, హావ్‌డా రైల్వే స్టేషన్‌లోని 4, 5 ప్లాట్‌ఫామ్‌లో ఆమె తిరిగినట్లు సీసీటీవీ పుటేజీలో కనిపించింది. తనతోపాటు మొబైల్ ఫోన్‌ను ఆమె తీసుకెళ్లినప్పటికీ.. ఆ ఫోన్ పనిచేయకపోవటం కుటుంబ సభ్యుల్లో మరింత ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు దమయంతి ఆచూకీని కనుగొనేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రత్యేక బృందాలు యువ క్రీడాకారిణి ఆచూకీ కోసం అనుమానం ఉన్న అన్ని ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి.

దమయంతి ప్రతిరోజు తెల్లవారుజామునే షూటింగ్ సాధన చేసేదని, ఇటీవల జాతీయ జట్టు ట్రయల్స్‌కు ఎంపిక కావడంతో ఎంతో ఉత్సాహంగా ఉండేదని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. ఇంట్లో ఎలాంటి గొడవలు, విభేదాలు లేవని, ఆమె అకస్మాత్తుగా అదృశ్యం కావడం తమకు అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఆమె కావాలనే కనిపించకుండా వెళ్లిపోయిందా..? లేదంటే ఎవరైనా కిడ్నాప్ చేశారా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువ క్రీడాకారిణి మిస్సింగ్ వ్యవహారం ప్రస్తుతం ఫశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనేకాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.