FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్‌కు డొనాల్డ్ ట్రంప్.. అయ్యో.. అర్జెంటీనాకు కొత్త టెన్షన్..
FIFA World Cup 2026 : అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరుగనున్న ఫిఫా వరల్డ్‌కప్ 2026 ఫైనల్ మ్యాచ్ చూసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరుకానున్నారు.
US President Donald Trump to attend FIFA World Cup 2026 final
- మెల్లైఫ్ స్టేడియంలో ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్
- పైనల్‌కు హాజరుకానున్న డొనాల్డ్ ట్రంప్
- రిఫరీగా స్లోవ్కో విన్సిచ్.. అర్జెంటీనాకు కొత్త టెన్షన్..
FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఫుల్బాల్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. న్యూజెర్సీలోని మెల్లైఫ్ స్టేడియంలో అర్జెంటీనా, స్పెయిన్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం.. ఆదివారం అర్ధరాత్రి తరువాత 12.30గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతోంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా.. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా హాజరువుతున్నారు. వైట్‌హౌస్ ఇప్పటికే ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది.
డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్ లో ఫిఫా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని, ఆదివారం ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించనున్నారని వైట్‌హౌస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ వెల్లడించారు. అమెరికా చరిత్రలో అత్యధికంగా వీక్షించబడిన, అత్యంత భద్రతతో నిర్వహించిన, అత్యంత విజయవంతమైన ప్రపంచకప్‌కు ట్రంప్ హాజరుతో ఘన ముగింపు లభిస్తుందని లెవిట్ పేర్కొన్నారు.
అర్జెంటీనా, స్పెయిన్ జట్ల మధ్య ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచ కప్‌ను సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో అర్జెంటీనా పట్టుదలతో ఉంది. అయితే, ఆ జట్టుకు ఓ కొత్త సమస్య వచ్చిపడింది. ఫైనల్ మ్యాచ్ రిఫరీగా వ్యహరించనున్న స్లోవ్కో విన్సిచ్తోనే అర్జెంటీనాకు సమస్య. ఎందుకంటే.. గతంలో ఆయన రిఫరీగా ఉన్న మ్యాచ్ లో అర్జెంటీనా ఓటమిని చవిచూసింది. ఇప్పటి వరకు ఈ ప్రపంచ కప్‌లో మ్యాచ్ నిర్వాహకులు, రిఫరీలు అర్జెంటీనాకు అనుకూలంగా ఉన్నారనే వాదన నేపథ్యంలో ఫిఫా ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రపంచ కప్ ఫైనల్‌కోసం ఫిఫా నియమించిన 47ఏళ్ల స్లోవ్కో విన్సిచ్ స్లోవేకియాకు చెందిన రిఫరీ. 2010 నుంచి ఈ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. విన్సిచ్ ఫైనల్‌కు రిఫరీగా వస్తుండటంతో మెస్సి నాయకత్వంలోని అర్జెంటీనా శిబిరంలో గుబులు రేగుతోంది.
