Lamine Yamal : 2007లో మెస్సీతో ఉన్న ఈ చిన్నారి ఎవరు? నాడు పసివాడిగా.. నేడు ప్రత్యర్థిగా..
లియోనల్ మెస్సీ, లామిన్ యమాల్ కు (Lamine Yamal )సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
The story behind 2007 photo going viral of Lionel Messi with baby Lamine Yamal
Lamine Yamal : ఫిఫా ప్రపంచకప్ 2026 ప్రపంచకప్ ఫైనల్ ఆదివారం (జూలై 19) జరగనుంది. స్పెయిన్, అర్జెంటీనా జట్లు కప్పు కోసం పోటీపడనున్నాయి. ఈ క్రమంలో 2007లో తీసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫోటోల్లో ఆ సమయంలో 20 ఏళ్లు ఉన్న లియోనల్ మెస్సీ ఓ చిన్నారిని తన చేతుల్లో ఎత్తుకున్నాడు. అంతేకాకుండా అతడికి స్నానం చేయిస్తున్నట్లు ఉంది.

ఇందులో విశేషం ఏముందని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం ఆగండి.. కట్ చేస్తే.. ఇప్పుడు ఆ పిల్లాడు పెద్దవాడు అయ్యాడు. అతడు ఓ ఫుట్‌బాల్ స్టార్‌గా ఎదిగాడు. పసిబిడ్డగా ఉన్నప్పుడు చేతుల్లో ఎత్తుకుని ఆడించిన దిగ్గజ ఆటగాడికి ప్రత్యర్థిగా ఆడబోతున్నాడు. అది కూడా ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో. అప్పటి పిల్లవాడు మరెవరో కాదు లామిన్ యమాల్.

ఆ ఫోటో ఎలా తీసారు?
క్లబ్ ఫుట్‌లో మెస్సీ బార్సిలోనా క్లబ్ తరుపున ఆడతాడు అనే విషయం తెలిసిందే. 2007లో ఓ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించింది. అందులో భాగంగా ఎంపిక చేసిన కొందరు చిన్నారులతో మెస్సీ సహా కొందరు స్టార్ ఆటగాళ్లుతో కలిసి ఫోటోషూట్ నిర్వహించారు.
యూరో 2024లో స్పెయిన్ విజయం సాధించిన తర్వాత.. యమాల్ తండ్రి మౌనిర్ నస్రావీ ఈ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో “The beginning of two legends” (ఇద్దరు దిగ్గజాల ఆరంభం) అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేయడంతో ఇది ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. ఇక ఇప్పుడు ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో మరోసారి వైరల్ అవుతోంది.
Harry Brook : భారత్ పై రెండో వన్డేలో విజయం.. ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ కీలక వ్యాఖ్యలు..

ఇదిలా ఉంటే.. ఈ ఇద్దరిలో ఎవరు ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో గెలిచి కప్పును అందుకుంటారో చూడాల్సిందే.
