Shooter Konica Layak : సోనూసూద్ నుంచి రైఫిల్ అందుకున్న నేషనల్ షూటర్ ఆత్మహత్య..!

యువ తేజం, జాతీయ స్థాయి షూటర్ కోణిక లాయక్ (Konica Layak) ఆత్మహత్యకు పాల్పడింది. పశ్చిమ బెంగాల్ హౌరా జిల్లాలోని బాలీలో తన హాస్టల్ లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

Shooter Konica Layak : యువ తేజం, జాతీయ స్థాయి షూటర్ కోణిక లాయక్ (Konica Layak) ఆత్మహత్యకు పాల్పడింది. పశ్చిమ బెంగాల్ హౌరా జిల్లాలోని బాలీలో తన హాస్టల్ లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. హౌరా పోలీసుల కథనం ప్రకారం.. హాస్టల్ గదిలో సూసైడ్ నోట్ లభ్యమైంది. అందులో తన తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చడంలో విఫలమయ్యానని తీవ్ర మనస్తాపానికి గురైనట్టు పోలీసులు తెలిపారు. తల్లిదండ్రుల కలలను నెరవేర్చలేకపోతున్నందుకు తాను ఆత్మహత్యచేసుకుంటున్నట్టుగా ఆమె సూసైడ్ నోట్ లో రాసినట్టు పోలీసులు వెల్లడించారు. షూటింగ్ లో తన ప్రావీణ్యాన్ని నిరూపించుకునేందుకు అవకాశాలు రాకపోవడంతో ఆమె తీవ్ర మనస్తపానికి లోనైనట్టు నోట్ రాసినట్టు తెలుస్తోంది.

ఇటీవలే న‌టుడు సోనూసూద్ నుంచి ప్రాక్టీస్ కోసం రైఫిల్ కూడా అందుకుంది షూటర్ కోణిక.. ప‌శ్చిమ బెంగాల్‌లోని హౌరాలో షూటింగ్‌లో శిక్ష‌ణ తీసుకుంటోంది. జీవీ మ‌వ‌లాంక‌ర్ ప్రీ-నేష‌న‌ల్ ఈవెంట్‌లో కోణిక డిస్‌క్వాలిఫై అయింది. తన టార్గెట్‌ను ట్యాంప‌ర్ చేసిందనే కారణంతో ఆమెను డిస్‌క్వాలిఫై చేయడం జరిగింది. అప్పటినుంచి కోణిక మరింత డిప్రెషన్‌కు గురైనట్టు తోటివారు చెబుతున్నారు. హాస్ట‌ల్‌లో త‌న రూమ్మేట్స్ అంద‌రూ బ‌య‌ట‌కు వెళ్లిన తర్వాత కోణిక సూసైడ్ చేసుకున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు.

మృత‌దేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించినట్టు పోలీసులు తెలిపారు. సెప్టెంబ‌రు నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ ముగ్గురు జాతీయస్థాయి భార‌త షూట‌ర్లు ఆత్మ‌హ‌త్య చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. అలా ఆత్మహత్యకు పాల్పడిన షూటర్లలో కోణిక నాలుగో షూట‌ర్‌. భార‌త షూటింగ్ క్రీడ‌కు మంచిది కాద‌ని క్రీడాకారులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read Also : Kidney Stones Remove : సర్జరీ లేకుండానే.. పేషెంట్ కిడ్నీ నుంచి 150 రాళ్లు తొలగింపు… హైదరాబాద్‌ వైద్యుల ఘనత!

ట్రెండింగ్ వార్తలు