టీమిండియా సారథి విరాట్ కోహ్లీ.. తన బౌలర్ల అభిప్రాయాలను శ్రద్ధగా ఆలకిస్తాడని భారత యువ పేసర్ నవదీప్ సైనీ వెల్లడించాడు. అభిప్రాయాలు పంచుకుంటే అభినందిస్తాడని చెప్పుకొచ్చాడు. ఆయనలో నచ్చే నాయకత్వ లక్షణాల్లో ఇదొకటని నవదీప్ అన్నారు
అరంగేట్రం మ్యాచులోనే అదరగొట్టిన సైనికి కోహ్లీ జట్టులో చోటిచ్చాడు. అతడిలో ఆత్మవిశ్వాసం నింపాడు. అందుకు తగ్గట్టే ఈ యువ పేసర్ రాణించాడు. త్వరలో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అతడు మళ్లీ కోహ్లీ సారథ్యంలో ఆడనున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రధాన బౌలర్లలో ఒకడిగా సైనీ ఉన్నాడు.
ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలో మాట్లాడిన సైనీ విరాట్ ప్రతి విషయాన్ని శ్రద్ధగా ఆలకిస్తాడని చెప్పాడు. బౌలర్లు జట్టు ప్రణాళికకు అనుగుణంగా బంతులు వేయాలని భావిస్తాడని అన్నారు. ఆ వ్యూహం పనిచేయకపోతే వారి అభిప్రాయాలను తీసుకుంటాడని చెప్పారు. తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పే బౌలర్లను ఆయన అభినందిస్తాడని అన్నారు. అలా చేయడం ద్వారా ఆ బౌలర్ ఆలోచిస్తున్నాడని తెలుస్తుంది. తర్వాత ఏం చేయాలో అవగాహన ఉంటుంది’ అని సైని అన్నాడు.
‘బౌలర్ అభిప్రాయం చెప్పాక కోహ్లీ భాయ్ సలహాలు ఇస్తాడని, మార్పులు ఉంటే సూచిస్తాడని చెప్పారు. బౌలర్ ప్రతి దానికి తల ఊపాలని కోహ్లీ కోరుకోడు’ అని అతను అన్నారు.