Neeraj Chopra: పాక్ ప్లేయర్‌ పట్ల నీరజ్ చోప్రా ప్రవర్తనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్న నెటిజన్లు .. వీడియో వైరల్

మ్యాచ్ అనంతరం ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పాకిస్థాన్ త్రోయర్ అర్షద్ నదీమ్, నీరజ్ చోప్రా ఒకరినొకరు అభినందించుకున్నారు.

Neeraj Chopra

World Athletics Championships: ప్రతిష్టాత్మక ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో గతేడాది రజతంతో సరిపెట్టుకున్న భారత జావెలియన్ త్రో సంచలనం నీరజ్ చోప్రా మరోసారి అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఈసారి నీరజ్ చోప్రా తన పేరును చరిత్రలో నిలుపుతూ గ్లోబల్ అథ్లెటిక్స్ మీట్‌లో బంగారు పతకం సాధించారు. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్‌లో నీరజ్ చోప్రా తన 2వ ప్రయత్నంలో 88.17 మీటర్లు విసిరడంతో బుడాపెస్ట్ ప్రేక్షకులు ఆనందోత్సాహాలతో హోరెత్తించారు. భారత అథ్లెట్‌కు పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్, జర్మనీకి చెందిన జూలియన్ వెబర్, చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకుబ్ వడ్లెజ్‌ల నుంచి గట్టి పోటీ ఎదురైంది. చివరికి చోప్రా ఆధిపత్యం చెలాయించారు. పాకిస్థాన్ త్రోయర్ అర్షద్ సదీమ్ (87.82) రజతం నెగ్గాగా, చెక్‌కు చెందిన వద్లెచ్ (86.67) కాంస్యం చేజిక్కించుకున్నాడు. మొత్తంగా ప్రపంచ అథ్లెటిక్స్‌లో భారత్‌కు లభించిన మూడో పతకం కాగా.. స్వర్ణం గెలుచుకోవడం ఇదే తొలిసారి.

Neeraj Chopra : ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రాకు మరో బంగారుపతకం

మ్యాచ్ అనంతరం ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పాకిస్థాన్ త్రోయర్ అర్షద్ నదీమ్, నీరజ్ చోప్రా ఒకరినొకరు అభినందించుకున్నారు. ఆ తరువాత.. మూడో స్థానంలో నిలిచిన వద్లెచ్, నీరజ్ చోప్రా తమతమ దేశీ జెండాలను పట్టుకొని ఫొటోలు దిగుతున్నారు. ఈ క్రమంలో నీరజ్ పక్కనే ఉన్న పాక్ ప్లేయర్‌ను చూసి.. ఫొటో దిగేందుకు రావాలనిపిలిచారు. పాక్ ప్లేయర్‌ను పక్కనే నిలబెట్టుకొని భారతీయ జెండాతో ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు నీరజ్ చోప్రాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. నీరజ్ నీది ఎంత మంచి మనసు.. నువ్వు గ్రేట్ నీరజ్ అంటూ ప్రశంసిస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు