Neeraj Chopra : పారిస్ ఒలింపిక్స్‌లో అద‌ర‌గొట్టిన నీర‌జ్ చోప్రా.. ప‌త‌కానికి అడుగు దూరంలో

పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా అద‌ర‌గొట్టాడు.

Neeraj Chopra qualifies for javelin throw final at Paris Olympics 2024

Neeraj Chopra : పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా అద‌ర‌గొట్టాడు. డిఫెండింగ్ ఒలింపిక్ ఛాంపియన్ అయిన నీర‌జ్‌ ఫైన‌ల్‌లో అడుగుపెట్టాడు. స్టేడ్ డి ఫ్రాన్స్‌లో 89.34 మీటర్ల త్రో (గ్రూప్ బి)తో పారిస్ ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఇది గ్లోబల్ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్‌కి అత్యుత్తమ త్రో కావ‌డం గ‌మ‌నార్హం.

ఇక స్టాక్‌హోమ్ డైమండ్ లీగ్‌లో 89.94 మీటర్ల తర్వాత రెండో అత్యుత్త‌మ త్రో కావ‌డం విశేషం. మొద‌టి ప్ర‌య‌త్నంలోనే నీర‌జ్ దీన్ని అందుకున్నాడు. అంతకు ముందు దోహాలో నీరజ్ 88.36 మీటర్లు, పావో నుర్మి గేమ్స్‌లో 85.97 మీటర్లు విసిరి విజేతగా నిలిచిన సంగ‌తి తెలిసిందే.

Also Read: మంట‌ల్లో కాలిపోతున్న బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ మోర్తజా ఇళ్లు.. అస‌లేం జ‌రిగిందంటే..?

నీర‌జ్ స‌హ‌చ‌ర అథ్లెట్ కిషోర్ జెనా క్వాలిఫికేష‌న్ ఈవెంట్ (గ్రూపు ఏ)లో 80.73 మీట‌ర్లు విసిరాడు. తొలి ప్ర‌య‌త్నంలో అత‌డు దీన్ని సాధించాడు. అయితే.. ఇది ఫైన‌ల్‌కు అర్హ‌త సాధించేందుకు స‌రిపోలేదు.

కెన్యాకు చెందిన జూలియస్ యెగో 85.97 మీటర్లు, చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకుబ్ వడ్లెజ్‌ 85.63 మీటర్ల త్రోలతో ఫైనల్‌కు అర్హత సాధించారు. జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ కూడా 87.76 మీటర్ల త్రో తో అర్హత సాధించాడు.

Also Read : రోహిత్ శ‌ర్మ‌ను ఊరిస్తున్న రికార్డు.. మూడో వ‌న్డేలో అందుకుంటాడా..?

ఆగ‌స్టు 8న ఫైన‌ల్ జ‌ర‌గ‌నుంది. భార‌త కాల‌మానం ప్ర‌కారం రాత్రి 11.55 గంట‌ల‌కు ఫైన‌ల్ ఆరంభం కానుంది.

ట్రెండింగ్ వార్తలు