IND vs NZ : భార‌త్‌తో టెస్టు సిరీస్‌కు న్యూజిలాండ్ జ‌ట్టు ఇదే.. 2024లో క్లీన్‌స్వీప్‌ను దృష్టిలో ఉంచుకుని..

IND vs NZ : భార‌త్, న్యూజిలాండ్‌ల మ‌ధ్య న‌వంబ‌ర్ 19న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. స్వ‌దేశంలో జ‌ర‌గ‌నున్న ఈ సిరీస్ కోసం

IND vs NZ New Zealand Announce Squad For Tests vs India

IND vs NZ : భార‌త్, న్యూజిలాండ్‌ల మ‌ధ్య న‌వంబ‌ర్ 19న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. స్వ‌దేశంలో జ‌ర‌గ‌నున్న ఈ సిరీస్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు త‌మ జ‌ట్టును ప్ర‌క‌టించింది. టామ్ లాథ‌మ్ నాయ‌క‌త్వంలో కివీస్ బ‌రిలోకి దిగ‌నుంది.

ప్రస్తుతం భారత్, న్యూజిలాండ్ జట్లు అన్ని ఫార్మాట్ల సిరీస్‌లో తలపడుతున్నాయి. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 3-2తో కైవసం చేసుకోగా, ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లోనూ ప్ర‌స్తుతం 2-0తో ఆధిక్యంలో నిలిచి సిరీస్‌ను సొంతం చేసుకుంది. మంగళవారం హామిల్టన్‌లో జరగాల్సిన మూడో వన్డే వర్షం కారణంగా రద్దయింది.

Hardik Pandya-Arshdeep Singh : హార్దిక్ -అర్ష్‌దీప్ ట్రేడ్ డీల్ పూర్తి.. పెరిగిన పాండ్యా జీతం..

ఇక మిగిలిన రెండు వన్డేల అనంతరం ఇరు జట్లు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనున్నాయి. 2024లో భారత్‌పై న్యూజిలాండ్ 3-0తో చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత ఇరు జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు సిరీస్ ఇదే కావడం విశేషం.

ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లిన టెస్టు జట్టులో పెద్దగా మార్పులు చేయకుండా న్యూజిలాండ్ జట్టును ఎంపిక చేసింది. గాయాల కారణంగా బెన్ సియర్స్, జాక్ ఫౌల్క్స్, విల్ ఓ రూర్కే లు జట్టుకు దూరం అయ్యారు. వీరి స్థానంలో జాకబ్ డఫీకి అవకాశం కల్పించారు.

మరోవైపు టామ్ బ్లండెల్, డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర‌లు గాయాల నుంచి కోలుకుంటున్నారు. తొలి టెస్టు సమయానికి వీరు అందుబాటులోకి వ‌స్తార‌ని కివీస్ తెలిపింది.

భారత్‌తో టెస్టు సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు..

టామ్ లాథమ్ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, మాట్ హెన్రీ, కైల్ జేమీసన్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్నర్, విల్ యంగ్.