IND vs NZ : భార‌త్‌తో మ్యాచ్‌ల‌కు ముందు న్యూజిలాండ్‌కు వ‌రుస షాక్‌లు..

భార‌త్‌తో జ‌ర‌గ‌నున్న మ‌ల్టీ ఫార్మాట్ సిరీస్‌ల‌కు ముందు న్యూజిలాండ్‌కు (IND vs NZ) వ‌రుస షాక్‌లు త‌గులుతున్నాయి

New Zealand Suffer Major Injury Blow Ahead Of Series vs India

IND vs NZ : భార‌త్‌తో జ‌ర‌గ‌నున్న మ‌ల్టీ ఫార్మాట్ సిరీస్‌ల‌కు ముందు న్యూజిలాండ్‌కు వ‌రుస షాక్‌లు త‌గులుతున్నాయి. ఇప్ప‌టికే ఆ జ‌ట్టు ఆట‌గాళ్లు మార్క్ చాప్‌మన్ , జాక్ ఫౌల్క్స్ లు గాయాల కార‌ణంగా భార‌త్‌తో అక్టోబ‌ర్ 5 నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌కు దూరం అయిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా ఆ జ‌ట్టు స్టార్ పేస‌ర్ విల్ ఓ’రూర్క్ టీమ్ఇండియాతో జ‌ర‌గ‌నున్న వ‌న్డే, టెస్టు సిరీస్‌ల‌కు దూరం అయ్యాడు. ఈ విష‌యాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వెల్ల‌డించింది. అత‌డు పిక్క కండ‌రాల గాయం నుంచి కోలుకుంటున్నాడ‌ని, ముందస్తు చ‌ర్య‌లో భాగంగానే అత‌డు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా తెలిపింది. ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌తో తిరిగి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నాడని న్యూజిలాండ్ చెప్పింది.

Gautam Gambhir : రెండో టీ20 మ్యాచ్‌లో ఓట‌మి.. గంభీర్ కీల‌క వ్యాఖ్య‌లు.. ఆ ఆట‌గాళ్ల కెరీర్‌ ప్ర‌మాదంలో ప‌డింది..

డిసెంబర్ ప్రారంభంలో ఆస్ట్రేలియాతో జ‌ర‌గ‌నున్న నాలుగు మ్యాచ్‌ల టెస్టుల సిరీస్ నాటికి అత‌డు కోలుకుని జ‌ట్టులోకి రీ ఎంట్రీ ఇస్తాడ‌ని ఆశిస్తున్న‌ట్లు న్యూజిలాండ్ కోచ్ రాబ్ వాల్టర్ తెలిపాడు. భార‌త్‌తో జ‌రిగే ప్ర‌తిష్టాత్మ‌క సిరీస్‌కు అత‌డు దూరం కావ‌డం నిరాశ‌కు గురి చేసింద‌న్నాడు.

ప్ర‌స్తుతం అత‌డు రెండు గాయాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నాడ‌ని, అత‌డు పూర్తిగా కోలుకోవ‌డానికి మ‌రికొంత స‌మ‌యం తీసుకోవ‌డ‌మే ఉత్త‌మం అని చెప్పుకొచ్చాడు.

Shai Hope : రెండో టీ20 మ్యాచ్‌లో విజ‌యం.. వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ కామెంట్స్ వైర‌ల్‌.. నిజం చెప్పాలంటే..

టెస్టుల్లో విల్ ఓ’రూర్క్ కు అద్భుత‌మైన రికార్డు ఉంది. 2024లో అత‌డు సుదీర్ఘ ఫార్మాట్‌లో అరంగ్రేటం చేసిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 14 టెస్టులు ఆడాడు. 49 వికెట్లు తీశాడు. జూన్‌లో ఇంగ్లాండ్‌లో న్యూజిలాండ్ 2-1 తేడాతో సిరీస్ గెలవడంలో కీల‌క పాత్ర పోషించాడు. ఆ సిరీస్‌లో 10 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఆ సిరీస్‌లో చివ‌రి టెస్టులో అత‌డు గాయ‌ప‌డ్డాడు. అప్ప‌టి నుంచి అత‌డు మ్యాచ్‌లు ఆడ‌డం లేదు.