భారతదేశంలో ఏ రంగంలోనైనా (రాజకీయాలు లేదా వాణిజ్యం, విద్యా లేదా క్రీడలు) ఒక వ్యక్తిలో సమున్నత గుణ శీలాలకు ప్రశంసనీయమైన విజయాలు తోడయినప్పుడు సంబంధిత సంస్థలో ఆ వ్యక్తి ప్రాబల్యం పెరిగిపోవడం కద్దు. వాస్తవమేమిటంటే క్రికెట్ క్షేత్రంలోనే గాక, దానికి వెలుపల కూడా విరాట్ చాలా ప్రభావశీల వ్యక్తి. క్రికెటింగ్ గొప్పదనం, మానసిక చురుకుదనం, వ్యక్తిగత ఆకర్షణ కలగలసిన విరాట్ లాంటి మరొకరు భారతీయ క్రికెట్ చరిత్రలో ఎవ్వరూ కన్పించరు. ఒక్క అనీల్ కుంబ్లేను మాత్రమే విరాట్‌తో కొంతవరకు పోల్చవచ్చు.
మనసు పెట్టి పనిచేస్తూ ఓర్పుతో అడుగేస్తే ఏదైనా సాధ్యమే.. పిల్లోడు అన్నాడు.. పిడుగులా పోరాడాడు.. రత్నంలా తేలిననాడు వాగిన నోళ్లు మూసుకుపోతాయి కదా? ఐపీఎల్ 13వ సీజన్‌లో మెరుపులా మెరిసి జట్టును ఫైనల్‌కు తీసుకుని వెళ్లిన ఆటగాడు శ్రేయాస్ అయ్యర్.. ఐపీఎల్ మొదటి నుంచి ఆడుతూ కూడా ఢిల్లీ ఒక్కసారి కూడా ఫైనల్ చేరలేదు. అయితే ఎప్పుడైతే శ్రేయాస్ అయ్యర్ పగ్గాలు చేపట్టాడో ఢిల్లీ తలరాత మారిపోయింది. ఐపీఎల్ 2019 సీజన్‌లో ఢిల్లీ టీమ్‌ని కెప్టెన్‌గా ప్లేఆఫ్‌కి చేర్చిన అయ్యర్.. ఐపీఎల్ 2020లో ఏకంగా ఫైనల్‌కి తీసుకుని వెళ్లాడు.
https://10tv.in/a-young-man-selling-a-kidney-for-an-iphone/
ఫైనల్‌లో గెలవకపోయినా కూడా శ్రేయాస్ అయ్యర్‌పై ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి. పదమూడేళ్ల ఐపీఎల్ చరిత్రలో జట్టును ఫైనల్‌కు తీసుకుని వెళ్లిన శ్రేయాస్ అయ్యర్‌పై ఆస్ట్రేలియన్ ఆటగాడు ప్రశంసల వర్షం కురిపించాడు. శ్రేయస్ అయ్యర్‌ను ఆస్ట్రేలియా వికెట్‌కీపర్ అలెక్స్ కేరీ భావి భారత కెప్టెన్ అంటూ జోస్యం చెప్పేశాడు. వ్యక్తిగత ప్రదర్శన కంటే జట్టు గురించి ఆలోచించే శ్రేయస్ కెప్టెన్‌గా రాణించగలడని అన్నాడు. భవిష్యత్తులో భారత జట్టును నడిపించే సత్తా అతనికి ఉందని అన్నాడు.
సందేహమే లేదు.. క్రికెట్‌లో టీమిండియాను కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ నడిపిస్తాడు. ఆ సామర్థ్యం అతనికి ఉంది. అతను అద్భతమైన లీడర్. రాబోవు రోజుల్లో మరింత మెరుగవుతాడు. జట్టులోని ఆటగాళ్లను అయ్యర్ చక్కగా సమన్వయం చేస్తాడు. ఈ విషయం గత రెండు ఐపీఎల్ సీజన్లలో స్పష్టమైందని కేరీ అన్నాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ జట్టుకు కేరీ ప్రాతినిధ్యం వహించాడు. అయితే ఎక్కువ మ్యాచ్‌లలో అతనికి ఆడే అవకాశం లభించలేదు. ఈ ఏడాది ఐపీఎల్‌లో 3 మ్యాచ్‌లాడిన కేరీ 32 పరుగులు చేశాడు.