Sourav Ganguly: వారం రోజుల్లో భారత్-పాక్ వన్డే మ్యాచ్.. సౌరవ్ గంగూలీ ఏమన్నారో తెలుసా?

భారత్-పాక్ మ్యాచ్ పై టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ (BCCI) మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.

Sourav Ganguly

Sourav Ganguly – Asia Cup 2023: భారత్-పాకిస్థాన్ వన్డే మ్యాచ్‌ కోసం ఇరు దేశాల క్రికెట్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఆసియా కప్-2023లో భారత్-పాకిస్థాన్ (Pakistan) జట్లు సెప్టెంబరు 2న తలపడనున్న విషయం తెలిసిందే.

ఆసియా కప్-2023 ఈ నెల 30 నుంచి ప్రారంభం కానుంది. భారత్-పాక్ మ్యాచ్ పై టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ (BCCI) మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. సాధారణంగా ఏ టోర్నమెంట్ జరుగుతున్నా అందులో ఫేవరెట్ జట్టు ఏదన్న విషయంపై మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలు చెబుతుంటారు.

అయితే, ఆసియా కప్-2023లో ఫేవరెట్ జట్టు ఏదన్న విషయం చెప్పడం చాలా క్లిష్టతరమని గంగూలీ అన్నారు. ఏ జట్టు అయినా గెలవవచ్చని చెప్పారు. భారత్-పాక్ రెండు జట్లూ బలంగా ఉన్నాయని తెలిపారు. పాక్‌ జట్టూ బాగా ఆడుతోందని చెప్పారు.

ఇక భారత జట్టు సామర్థ్యం గురించి తెలిసిందేనని అన్నారు. ఐర్లాండ్ తో ఇటీవల జరిగిన టీ20 సిరీస్ లో టీమిండియా ఆటగాడు జస్ప్రీత్ బుమ్రా అద్భుత రీతిలో ఆడాడని చెప్పారు. ఇప్పుడు మనం వన్డే మ్యాచులు ఆడాల్సి ఉందని అన్నాడు.

R Praggnanadhaa: ఈ దేశంలోనూ అమ్మ చేసి పెట్టిన రసం, రైస్ తిన్నాను.. చెస్ ప్రపంచ కప్‌ సిల్వర్ పతక విజేత ప్రజ్ఞానంద 

ట్రెండింగ్ వార్తలు