No Other Board Holds International Matches During Ipl
Shakib al Hasan: ఆల్ రౌండర్ షకీబ్ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుపై విమర్శలకు దిగాడు. తాను శ్రీలంకతో జరగబోయే టెస్టు సిరీస్ లు ఆడేందుకు సిద్ధంగా లేనని.. ఇండియాలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లకు ఆడేందుకు సన్నద్ధమవుతున్నానని.. దాంతో పాటు ఐపీఎల్ కు ప్రిపేర్ అవుతున్నట్లు చెప్పాడు.
‘వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ లో ఇవే మా చివరి రెండు టెస్టు మ్యాచ్ లు.. మేం ఫైనల్ కు వెళ్తామని అనుకోవడం లేదు. పాయింట్ల టేబుల్ లో మేం చివర్లోనే ఉన్నాం. అదేం పెద్ద తేడా చూపిస్తందనుకోవడం లేదు. ఈ సంవత్సరంలోనే ఇండియా వరల్డ్ కప్ టీ20 జరుగుతుంది. ఆ టోర్నమెంటే మాకు ఇంపార్టెంట్. ఏమైనా పెద్దగా చేయాలనుకుంటే దాని కోసమే ప్రిపేర్ కావాలి. అని షకీబ్ అల్ హసన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ఎవరైతే టెస్టులు ఆడనని అనుకుంటున్నారో.. వాళ్లు నా లెటర్ పూర్తిగా చదవలేదని అనుకుంటున్నా. అలా అని బీసీబీకి రాసిన లెటర్‌లో ఎక్కడా రాయలేదు. నేను ఐపీఎల్ ఆడి టీ20 వరల్డ్ కప్ కోసం ప్రిపేర్ అవుతానని రాశాను’ అని వెల్లడించాడు.
షకీబ్ ఆ లెటర్‌లో శ్రీలంకతో జరగబోయే టెస్టు సిరీస్‌కు అందుబాటులో ఉండనని.. రాబోయే టీ20 వరల్డ్ కప్ కు ప్రిపేర్ అవుతున్నానని చెప్పాడు. ఏప్రిల్ 21నుంచి మే 3వరకూ జరగనున్న ఈ సిరిస్ లకు షకీబ్ అందుబాటులో ఉండడని బీసీబీ క్రికెట్ ఆపరేషన్స్ ఛైర్మన్ అక్రమ్ చెప్పాడు.
అక్రమ్ భాయ్.. ప్రత్యేకించి నేను టెస్టు ఫార్మాట్ లు ఆడడానికి నిరాకరించానని.. రిపీటెడ్ గా చెప్తున్నాడు. నాకు తెలిసి అతను లెటర్ చదవలేదని అనుకుంటున్నా. ఒకవేళ ఆ టైంలో వన్డేలు ఉన్నా ఐపీఎల్ మాత్రమే ఆడాలనుకుంటున్నానని అందరికీ తెలుసు.
నాలుగు నెలల తర్వాత జరిగే వరల్డ్ కప్ టీ20లో అదే ప్రత్యర్థులపై అవే గ్రౌండ్ లో తలపడటానికి రెడీగా ఉన్నా. మా బంగ్లాదేశ్ టీం మేట్స్ తో ఆ అనుభవాన్ని పంచుకుంటా. మరే క్రికెట్ బోర్డు ఐపీఎల్ జరుగుతున్నంత కాలం ఇంటర్నేషనల్ మ్యాచ్ లు నిర్వహించాలని అనుకోదు. కానీ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అలా చేయలేదు. మేం మాత్రమే శ్రీలంకతో ఆడేందుకు రెడీగా ఉన్నాం.
అఫ్ఘనిస్తాన్ క్రికెటర్ ఐపీఎల్ జరుగుతున్న సమయంలో వాళ్ల దేశం కోసం మాత్రమే ఆడినట్లు మీరు చూశారు. ఆ క్రికెట్ బోర్డులు ఐపీఎల్ జరిగే సమయంలో ప్లేయర్లను ఫ్రీగా ఉంచుతాయి. మన సొంత ప్లేయర్లకు మనం విలువ ఇవ్వకపోతే ఎలా. బంగ్లాదేశ్ కోసం ఆడుతున్నప్పుడు అంతే అద్భుతంగా ప్రదర్శన ఎలా చేయగలం’ అని షకీబ్ అన్నాడు.
ఒక పచ్చి నిజం చెప్పాలంటే.. విదేశీ ఆటగాళ్లు బంగ్లాదేశ్ లో ఆడటానికి వస్తే వారిని మేం సర్ లేదా హుజూర్ అని పిలుస్తాం. అదే తరహాలో మా ప్లేయర్లకు గౌరవం లభించదు. బోర్డ్, ప్లేయర్లు గౌరవం ఇవ్వకుండా తిరిగి అదే ఎక్స్‌పెక్ట్ చేస్తే ఎలా అని షకీబ్ ప్రశ్నించారు.