×
Ad

IPL: RCB మాత్రమే కాదు..! అమ్మకానికి మరో ఫ్రాంచైజీ కూడా..

ఒకటి కాదు, రెండు ఐపీఎల్ జట్లు ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయని విన్నాను.

IPL: IPL 2026 కొన్ని నెలల్లో ప్రారంభం కానుంది. డిసెంబర్ 16న మినీ వేలం జరగనుంది. ఫ్రాంచైజీల యాజమాన్యాలలో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అధికారికంగా అమ్మకానికి ఉంచబడింది. ఒక్క ఆర్సీబీ మాత్రమే కాదు.. మరో ఫ్రాంచైజీ కూడా అమ్మకానికి రానుందని తెలుస్తోంది. 2008లో IPL ప్రారంభ ఎడిషన్ ఛాంపియన్‌లైన RCBతో పాటు రాజస్థాన్ రాయల్స్ (RR) కూడా అమ్మకానికి రానుందని సమాచారం.

లక్నో సూపర్ జెయింట్స్ (LSG) యజమాని సంజీవ్ గోయెంకా సోదరుడు, వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా ప్రకారం RCBతో పాటు రాజస్థాన్ రాయల్స్ కూడా అమ్మకానికి ఉంది. యజమానులు పూణే, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు లేదా USA నుండి ఉండొచ్చని అన్నారు.

“ఒకటి కాదు, రెండు ఐపీఎల్ జట్లు ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయని విన్నాను. ఆర్సీబీ, ఆర్‌ఆర్. పూణే, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు లేదా యుఎస్‌ఎ కి చెందిన వారు కొనుగోలు చేసే అవకాశం ఉంది?” అని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు.

రాయల్స్ 65శాతం వాటాను కలిగున్న రాయల్స్ స్పోర్ట్స్ గ్రూప్ (ఎమర్జింగ్ మీడియా స్పోర్టింగ్ హోల్డింగ్స్ లిమిటెడ్) యాజమాన్యంలో ఉందని నివేదికలు చెబుతున్నాయి. లాచ్లాన్ ముర్డోక్, రెడ్‌బర్డ్ క్యాపిటల్ పార్టనర్స్ కీలకమైన మైనారిటీ వాటాదారులు.

RCBని అమ్మకానికి పెట్టే ప్రక్రియను ప్రారంభించినట్లు నవంబర్ 5న డియాజియో ధృవీకరించింది. జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్, మణిపాల్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ గ్రూప్ (MEMG) అధిపతి రంజన్ పాయ్, RCBని కొనుగోలు చేయాలనుకుంటున్న వారిలో ఉన్నారు. ఈ ఇద్దరు వ్యాపారవేత్తలు కర్ణాటకకు చెందిన వారు. బెంగళూరులో స్థిరపడ్డారు. ఇద్దరూ ఆర్థికంగా బలవంతులు. ఒక బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన జట్టును కొనుగోలు చేసే సామర్థ్యం వారికుంది.

సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా CEO అదార్ పూనావాలాతో కలిసి కామత్, పాయ్ సంయుక్తంగా బిడ్‌లో పాల్గొంటారని నివేదిక పేర్కొంది. ఫోర్బ్స్ ప్రకారం, కామత్ నికర విలువ 2.5 బిలియన్ డాలర్లు. పాయ్ నికర విలువ 2.8 బిలియన్ డాలర్లుగా అంచనా వేయబడింది.

Also Read: స్మృతి మంధాన, పలాశ్ ముచ్చల్ వివాహంపై సస్పెన్షన్‌కు తెరదించిన పలాశ్‌ తల్లి అమిత.. ఏం చెప్పారంటే?