×
Ad

NZ vs WI : న్యూజిలాండ్‌కు భారీ షాక్‌..

వెస్టిండీస్‌తో రెండో వ‌న్డే ముందు న్యూజిలాండ్‌కు (NZ vs WI) బారీ షాక్ త‌గిలింది.

NZ vs WI Daryl Mitchell ruled out of series

NZ vs WI : వెస్టిండీస్‌తో రెండో వ‌న్డేకు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు స్టార్ బ్యాట‌ర్‌, తొలి వ‌న్డే సెంచ‌రీ హీరో డారిల్ మిచెల్ గ‌జ్జ‌లో గాయంతో బాధ‌ప‌డుతున్నాడు. ఈ క్ర‌మంలో అత‌డు రెండో వ‌న్డేతో (NZ vs WI ) పాటు మూడో వ‌న్డేకు సైతం దూరం అయ్యాడు. ఈ విష‌యాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వెల్ల‌డించింది.

‘క్రైస్ట్‌చర్చ్ వేదికగా వెస్టిండీస్‌తో జ‌రిగిన తొలి వన్డేలో మిచెల్ తొడ కండరాలు పట్టేశాయి. మ్యాచ్ అనంత‌రం అత‌డిని ఆస్ప‌త్రికి త‌ర‌లించి స్కానింగ్ నిర్వ‌హించారు. రిపోర్టుల్లో చిన్న‌పాటి చీలిక ఉన్న‌ట్లు తేలింది. ఈక్ర‌మంలో రెండు వారాల పాటు వైద్యులు అత‌డికి విశ్రాంతి అవ‌స‌రం అని సూచించారు. ఈ క్ర‌మంలోనే అత‌డు మిగిలిన రెండు వ‌న్డేల‌కు దూరం అయ్యాడు. అత‌డి స్థానాన్ని హెన్రీ నికోల్స్‌తో భ‌ర్తీ చేస్తున్నాం.’ అని కివీస్ క్రికెట్ బోర్డు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

IND vs SA : రెండో టెస్టుకు ముందు బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం.. స్టార్ ఆల్‌రౌండ‌ర్‌కు పిలుపు..

దీనిపై న్యూజిలాండ్ కోచ్ రాబ్ వాల్ట‌ర్ మాట్లాడుతూ.. డారిల్‌ మిచెల్ అద్భుతమైన‌ ఫామ్‌లో ఉన్నాడ‌ని అన్నాడు. అత‌డు మిగిలిన మ్యాచ్‌ల‌కు దూరం కావ‌డం జ‌ట్టుకు గ‌ట్టి ఎదురుదెబ్బ‌గానే చెప్ప‌వ‌చ్చున‌ని అన్నాడు. డిసెంబ‌ర్ 2 నుంచి వెస్టిండీస్‌తో జ‌రిగే మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ నాటికి పూర్తిగా కోలుకుంటాడ‌ని భావిస్తున్నామ‌న్నాడు.

మిగిలిన రెండు వ‌న్డేల‌కు న్యూజిలాండ్ జట్టు ఇదే..

డెవాన్ కాన్వే, రాచిన్ రవీంద్ర, విల్ యంగ్, హెన్రీ నికోల్స్, టామ్ లాథమ్(వికెట్‌ కీపర్‌), మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్‌), జకారీ ఫౌల్క్స్, కైల్ జామిసన్, మాట్ హెన్రీ, జాకబ్ డఫీ, నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్నర్, మార్క్ చాప్‌మన్