IND vs SA : రెండో టెస్టుకు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం.. స్టార్ ఆల్‌రౌండర్‌కు పిలుపు..
భారత్, దక్షిణాఫ్రికా జట్ల (IND vs SA) మధ్య శనివారం (నవంబర్ 22 ) నుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.
Nitish Reddy asked to rejoin team before IND vs SA 2nd Test
IND vs SA : భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య శనివారం (నవంబర్ 22 ) నుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. కోల్‌కతా వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఓడిపోయిన టీమ్ఇండియా ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తోంది. అయితే.. ఈ మ్యాచ్‌లో(IND vs SA) టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.
తొలి టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో ఓ స్వీప్ షాట్ ఆడుతూ అతడు గాయపడిన సంగతి తెలిసిందే. మెడ పట్టేయడంతో మైదానం వీడిన అతడు ఆ తరువాత మరోసారి మైదానంలో అడుగుపెట్టలేదు. ఆస్పత్రిలో చికిత్స పొందిన గిల్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతడి మెడ నొప్పి ఇంకా పూర్తిగా తగ్గలేదని, ఇలాంటి సమయంలో అతడు ప్రయాణాలు చేయవద్దని డాక్టర్లు సూచించినట్లు వార్తలు వస్తున్నాయి.
దీంతో గిల్ రెండో టెస్టులో ఆడడంపై సందేహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి జట్టులో చేరమని సూచించింది. వాస్తవానికి దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు నితీశ్‌కుమార్ రెడ్డి ఎంపిక అయ్యాడు. అయితే.. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ నేపథ్యంలో అతడిని జట్టు నుంచి రిలీవ్ చేశారు. ఇప్పుడు గిల్ గాయపడడంతో అతడిని తిరిగి జట్టులో చేరమని ఆదేశించినట్లు సమాచారం.
రెండో టెస్టుకు టీమ్ఇండియా స్వ్కాడ్ ఇదే..
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, నితీశ్ కుమార్ రెడ్డి.
