Sunil Gavaskar : అత‌డికి ఉన్న ఓపిక మీకు లేక‌పాయె.. టీమ్ఇండియా బ్యాట‌ర్ల‌పై సునీల్ గ‌వాస్క‌ర్ ఆగ్ర‌హం.. ఇక‌నైనా..

భార‌త జ‌ట్టు బ్యాటర్లు ద‌క్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బ‌వుమాను చూసి నేర్చుకోవాల‌ని సూచించాడు సునీల్ గ‌వాస్క‌ర్ (Sunil Gavaskar).

Sunil Gavaskar : అత‌డికి ఉన్న ఓపిక మీకు లేక‌పాయె.. టీమ్ఇండియా బ్యాట‌ర్ల‌పై సునీల్ గ‌వాస్క‌ర్ ఆగ్ర‌హం.. ఇక‌నైనా..

Team india batsmen should learn from temba bavuma says gavaskar

Updated On : November 18, 2025 / 10:51 AM IST

Sunil Gavaskar : కోల్‌క‌తాలోనీ ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భార‌త్ ఓడిపోయింది. 124 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించ‌లేకపోయింది. చివ‌రికి 93 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. దీంతో ద‌క్షిణాఫ్రికా 30 ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని అందుకుంది. కాగా.. ఈ పిచ్ పై అటు స‌ఫారీ బ్యాట‌ర్లు గానీ, ఇటు భార‌త బ్యాట‌ర్లు గానీ ప‌రుగులు చేసేందుకు తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డారు. అయితే.. ద‌క్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బ‌వుమా మాత్రం అద్భుతంగా ఆడాడు. రెండో ఇన్నింగ్స్‌లో అత‌డు 136 బంతులు ఎదుర్కొన్నాడు. 4 ఫోర్ల సాయంతో 55 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు.

ఈ మ్యాచ్‌లో రెండు జ‌ట్లు కూడా నాలుగు ఇన్నింగ్స్‌ల్లో ఒక్క‌సారి కూడా 200 ప‌రుగుల మైలురాయిని చేరుకోలేక‌పోయాయి. ఈ క్ర‌మంలో పిచ్ పై తీవ్రంగా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. వీటిపై టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు సునీల్ గ‌వాస్క‌ర్ స్పందించాడు. భార‌త జ‌ట్టు బ్యాటర్లు ద‌క్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బ‌వుమాను చూసి నేర్చుకోవాల‌ని సూచించాడు.

Rishabh Pant : ద‌క్షిణాఫ్రికాతో రెండో టెస్టు.. పంత్ సిక్స‌ర్ల సెంచ‌రీ ఛాన్స్‌..!

బ‌వుమా మంచి టెక్నిక్‌, అంకిత భావంతో క్రీజులో పాతుకుపోయాడ‌ని ఒక్కొ ప‌రుగు చేసుకుంటూ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకువెళ్లాడ‌ని అన్నారు. అత‌డిని చూసైన భార‌త బ్యాట‌ర్లు బాగా ఆడి ఉండాల్సింద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు.

అప్పుడు ఎవ్వ‌రూ జోక్యం చేసుకోరు..

పిచ్ పై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చిన‌ప్ప‌టికి కూడా తాము కోరుకున్న పిచ్ ఇదేన‌ని మ్యాచ్ అనంత‌రం కోచ్ గౌత‌మ్ గంభీర్ చెప్పిన సంగ‌తి తెలిసిందే. పిచ్ మ‌రీ అంత సంక్లిష్టంగా ఏమీ లేద‌ని, 124 ప‌రుగుల ల‌క్ష్యం ఛేదించ‌వ‌చ్చున‌ని అన్నాడు. దీనిపై గ‌వాస్క‌ర్ మాట్లాడుతూ.. ఐపీఎల్ స‌మ‌యంలో ఏ ఒక్క ఫ్రాంఛైజీ కూడా క్యూరేట‌ర్ ప‌ని విష‌యంలో జోక్యం చేసుకోద‌న్నారు. వారికి ఎలాంటి పిచ్ కావాలో కూడా అడ‌గ‌ర‌న్నాడు. క్యూరేట‌ర్ స్వ‌తంత్రంగా విధులు నిర్వ‌ర్తిస్తాడ‌ని చెప్పుకొచ్చాడు.

Ravindra Jadeja : టీమ్ఇండియా మ్యాచ్ ఓడిపోయినా.. చ‌రిత్ర సృష్టించిన ర‌వీంద్ర జ‌డేజా.. డ‌బ్ల్యూటీసీలో ఒకే ఒక్క‌డు..

ఏం చేయాలి అనే విష‌యం ఇత‌రుల క‌న్నా క్యూరేట‌ర్ కే ఎక్కువ తెలుసు. అందుక‌నే అత‌డి ప‌నిలో ఎవ్వ‌రూ జోక్యం చేసుకోవ‌చ్చు. మ‌నం కోరిన‌ట్లుగా పిచ్‌ను త‌యారు చేసి ఇవ్వ‌మంటే.. అప్పుడు ఎదురుదెబ్బ‌లు త‌గ‌ల‌వ‌చ్చు. కాబ‌ట్టి క్యూరేట‌ర్‌కు స్వేచ్ఛ ఇవ్వాలి అని సునీల్ గ‌వాస్క‌ర్ తెలిపారు.