Rishabh Pant : ద‌క్షిణాఫ్రికాతో రెండో టెస్టు.. పంత్ సిక్స‌ర్ల సెంచ‌రీ ఛాన్స్‌..!

ద‌క్షిణాఫ్రికాతో రెండో టెస్టు మ్యాచ్‌కు ముందు రిష‌బ్ పంత్‌ (Rishabh Pant )ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.

Rishabh Pant : ద‌క్షిణాఫ్రికాతో రెండో టెస్టు.. పంత్ సిక్స‌ర్ల సెంచ‌రీ ఛాన్స్‌..!

IND vs SA 2nd Test Rishabh Pant need 8 sixes to complete 100 Sixes in Tests

Updated On : November 17, 2025 / 5:46 PM IST

Rishabh Pant : భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య గౌహ‌తి వేదిక‌గా న‌వంబ‌ర్ 22 నుంచి 26 వ‌ర‌కు రెండో టెస్టు మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా స్టార్ వికెట్ కీప‌ర్, బ్యాట‌ర్ రిష‌బ్ పంత్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.

ఈ మ్యాచ్‌లో పంత్ (Rishabh Pant) గ‌నుక 8 సిక్స‌ర్లు కొడితే.. టెస్టు క్రికెట్‌లో 100 సిక్స‌ర్లు కొట్టిన తొలి భార‌త ప్లేయ‌ర్‌గా చ‌రిత్ర సృష్టిస్తాడు. ప్ర‌స్తుతం టెస్టుల్లో టీమ్ఇండియా త‌రుపున‌ అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ఆట‌గాడి రికార్డు పంత్ పేరిటే ఉండ‌డం గ‌మ‌నార్హం.

Ravindra Jadeja : టీమ్ఇండియా మ్యాచ్ ఓడిపోయినా.. చ‌రిత్ర సృష్టించిన ర‌వీంద్ర జ‌డేజా.. డ‌బ్ల్యూటీసీలో ఒకే ఒక్క‌డు..

2018లో అంత‌ర్జాతీయ టెస్టు క్రికెట్‌లో అడుగుపెట్టిన రిష‌బ్ పంత్ ఇప్ప‌టి వ‌ర‌కు 48 టెస్టులు ఆడాడు. 84 ఇన్నింగ్స్‌ల్లో 43.8 స‌గ‌టుతో 3456 ప‌రుగులు సాధించాడు. ఇందులో 8 శ‌త‌కాలు, 18 అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు పంత్ టెస్టుల్లో 92 సిక్స‌ర్లు బాదాడు.

భార‌త్ త‌రుపున టెస్టుల్లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ఆట‌గాళ్లు వీరే..

* రిష‌బ్ పంత్ – 48 టెస్టుల్లో 92 సిక్స‌ర్లు
* వీరేంద్ర సెహ్వాగ్ – 103 టెస్టుల్లో 90 సిక్స‌ర్లు
* రోహిత్ శ‌ర్మ – 67 టెస్టుల్లో 88 సిక్స‌ర్లు
* ర‌వీంద్ర జ‌డేజా – 88 టెస్టుల్లో 80 సిక్స‌ర్లు
* ఎంఎస్ ధోని – 90 టెస్టుల్లో 78 సిక్స‌ర్లు

Asia Cup Rising Stars 2025 : పాక్ చేతిలో ఓటమి.. టీమ్ఇండియా సెమీస్‌కు చేరాలంటే..?

* స‌చిన్ టెండూల్క‌ర్ – 200 టెస్టుల్లో 69 సిక్స‌ర్లు
* క‌పిల్ దేవ్ – 131టెస్టుల్లో 61 సిక్స‌ర్లు
* సౌర‌వ్ గంగూలీ – 113 టెస్టుల్లో 57 సిక్స‌ర్లు
* శుభ్‌మ‌న్ గిల్ – 40 టెస్టుల్లో 46 సిక్స‌ర్లు
* య‌శ‌స్వి జైస్వాల్ – 27 టెస్టుల్లో 43 సిక్స‌ర్లు