Asia Cup Rising Stars 2025 : పాక్ చేతిలో ఓటమి.. టీమ్ఇండియా సెమీస్‌కు చేరాలంటే..?
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నీలో (Asia Cup Rising Stars 2025) జితేశ్ శర్మ సారథ్యంలో భారత-ఏ జట్టు ఆడుతోంది
Asia Cup Rising Stars 2025 How can India qualify for semi finals after loss to Pakistan
Asia Cup Rising Stars 2025 : ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నీలో జితేశ్ శర్మ సారథ్యంలో భారత-ఏ జట్టు ఆడుతోంది. గ్రూప్-బిలో ఉన్న భారత్.. యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్‌లో 148 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అయితే.. ఆదివారం జరిగిన రెండో పోరులో పాకిస్తాన్ చేతులో అనూహ్యంగా పరాజయం పాలైంది.
ఈ మ్యాచ్‌లో భారత్-ఏ తొలుత బ్యాటింగ్ చేసింది. 19 ఓవర్లలో 136 పరుగులకు ఆలౌటైంది. టీమ్ఇండియా బ్యాటర్లలో వైభవ్ సూర్యవంశీ (45; 28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు), నమన్ ధీర్ (35; 20 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్)లు రాణించారు. మిగిలిన వారు ఘోరంగా విఫలం కావడంతో తక్కువ స్కోరుకే భారత్ పరిమితమైంది.
Temba Bavuma : చరిత్ర సృష్టించిన బవుమా.. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఏకైక కెప్టెన్..
137 పరుగుల లక్ష్యాన్ని పాక్ 13.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి అందుకుంది. పాక్ బ్యాటర్లలో మాజ్ సదఖత్ (79 నాటౌట్; 47 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ అర్థశతకంతో రాణించాడు.
సెమీస్ చేరాలంటే..?
పాక్ చేతిలో ఓడిపోవడంతో టీమ్ఇండియా సెమీస్ అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి. మంగళవారం ఒమన్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తేనే సెమీస్‌కు చేరుకుంటుంది. ఈ మ్యాచ్‌లో ఓడిపోతే మాత్రం ఇంటి ముఖం పడుతుంది.
Team India : కోల్‌కతాలో ఓటమి.. భారత్‌కు ఇంత నష్టం జరిగిందా? కోలుకోవడం కష్టమేనా?
భారత్, పాక్‌తో పాటు యూఏఈ, ఒమన్ దేశాలు గ్రూప్-బిలో ఉన్నాయి. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన యూఏఈ జట్టు సెమీస్ రేసు నుంచి నిష్ర్కమించింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన పాక్ ప్రస్తుతం గ్రూప్-బి టాపర్‌గా ఉంది. దీంతో ఆ జట్టు ఇప్పటికే సెమీస్‌కు చేరుకుంది. ఇక గ్రూప్-బి నుంచి మిగిలిన ఒక్క స్థానం కోసం భారత్, ఒమన్‌లు పోటీపడుతున్నాయి. ఇరు జట్లు ఒక్కొ మ్యాచ్‌లో గెలవగా మరో మ్యాచ్‌లో ఓడిపోయాయి. మంగళవారం విజయం సాధించే జట్టు సెమీస్‌లో అడుగుపెడుతుంది.
