IND vs SA 2nd Test Rishabh Pant need 8 sixes to complete 100 Sixes in Tests
Rishabh Pant : భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య గౌహతి వేదికగా నవంబర్ 22 నుంచి 26 వరకు రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.
ఈ మ్యాచ్‌లో పంత్ (Rishabh Pant) గనుక 8 సిక్సర్లు కొడితే.. టెస్టు క్రికెట్‌లో 100 సిక్సర్లు కొట్టిన తొలి భారత ప్లేయర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం టెస్టుల్లో టీమ్ఇండియా తరుపున అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడి రికార్డు పంత్ పేరిటే ఉండడం గమనార్హం.
2018లో అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో అడుగుపెట్టిన రిషబ్ పంత్ ఇప్పటి వరకు 48 టెస్టులు ఆడాడు. 84 ఇన్నింగ్స్‌ల్లో 43.8 సగటుతో 3456 పరుగులు సాధించాడు. ఇందులో 8 శతకాలు, 18 అర్థశతకాలు ఉన్నాయి. ఇప్పటి వరకు పంత్ టెస్టుల్లో 92 సిక్సర్లు బాదాడు.
భారత్ తరుపున టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు వీరే..
* రిషబ్ పంత్ – 48 టెస్టుల్లో 92 సిక్సర్లు
* వీరేంద్ర సెహ్వాగ్ – 103 టెస్టుల్లో 90 సిక్సర్లు
* రోహిత్ శర్మ – 67 టెస్టుల్లో 88 సిక్సర్లు
* రవీంద్ర జడేజా – 88 టెస్టుల్లో 80 సిక్సర్లు
* ఎంఎస్ ధోని – 90 టెస్టుల్లో 78 సిక్సర్లు
Asia Cup Rising Stars 2025 : పాక్ చేతిలో ఓటమి.. టీమ్ఇండియా సెమీస్‌కు చేరాలంటే..?
* సచిన్ టెండూల్కర్ – 200 టెస్టుల్లో 69 సిక్సర్లు
* కపిల్ దేవ్ – 131టెస్టుల్లో 61 సిక్సర్లు
* సౌరవ్ గంగూలీ – 113 టెస్టుల్లో 57 సిక్సర్లు
* శుభ్‌మన్ గిల్ – 40 టెస్టుల్లో 46 సిక్సర్లు
* యశస్వి జైస్వాల్ – 27 టెస్టుల్లో 43 సిక్సర్లు