Virat Kohli
ODI World Cuo 2023 Virat Kohli 49th century : భారత్ గడ్డపై జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ లో భారత్ అద్భుత ప్రదర్శన చేస్తోంది. ఎనిమిది మ్యాచ్ లు ఆడిన టీమిండియా అన్ని మ్యాచ్ లలోనూ విజయాలను నమోదు చేసుకుంది. ఈ క్రమంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన 35వ పుట్టినరోజున 49వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఫలితంగా లెజెండ్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు. ఈ క్రమంలో కోహ్లీపై మాజీ, తాజా ప్లేయర్స్ నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇదే సమయంలో పలువురు మాజీ ప్లేయర్స్ కోహ్లీ స్వార్థపూరిత ఆట ఆడుతున్నాడంటూ విమర్శలు కూడా వస్తున్నాయి. తాజాగా పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ మహ్మద్ హఫీజ్ విరాట్ స్వార్థపూరిత ఆటఆడుతున్నాడంటూ విమర్శలు చేశాడు.
పాకిస్థానీ టీవీ ఛానెల్ లో హఫీజ్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ అద్భతుమైన మైలురాయిని చేరుకోవడానికి తనను తాను జట్టు కంటే ముందు ఉంచాడని ఆరోపించాడు. విరాట్ మంచిగా ఆడటంలేదని నేను అనడం లేదు.. 97 పరుగుల వరకు చేరేవరకు అతను అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. కానీ, ఆ తరువాత అతను సెంచరీకి చేరుకునేందుకు జట్టు ప్రయోజనాల కంటే తన మైలురాయిని చేరుకోవటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు పాక్ మాజీ ప్లేయర్ విమర్శించాడు. ఇదే సమయంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పై హఫీజ్ ప్రశంసల వర్షం కురిపించాడు. భారత కెప్టెన్ జట్టుకోసం ఆడటానికి ఎంచుకున్నాడు. జట్టు ప్రయోజనం కోసం రోహిత్ తరచూ తనను తాను త్యాగం చేసే విధానం ఆకట్టుకుందని హఫీజ్ అన్నాడు. దక్షిణాఫ్రికాపై రోహిత్ ఆడిన ఇన్నింగ్స్ అద్భుతం. అతనికి తెలుసు పిచ్ కష్టంగా ఉంటుందని, పవర్ ప్లేలోనే అధిక పరుగులు రాబట్టాలని అతని భావించి ఆమేరకు పరుగులు రాబట్టాడు. రోహిత్ సెంచరీ కొట్టాలనుకుంటే జట్టు ప్రయోజనాలను పక్కకు పెట్టి తన స్వార్థం కోసం ఆడే అవకాశాలు ఉన్నాయి.. కానీ, అతని లక్ష్యం అతని వ్యక్తిగతం కంటే జట్టు ప్రయోజనాల కోసం ఉందని హఫీజ్ అన్నాడు.
పాక్ మాజీ ప్లేయర్ మహ్మద్ హఫీజ్ వ్యాఖ్యలకు టీమిండియా మాజీ ప్లేయర్ వెంకటేశ్ ప్రసాద్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు. విరాట్ కోహ్లీ స్వార్థపరుడు, వ్యక్తిగత మైలురాయికోసం ప్రాధాన్యత ఇస్తాడని ఫన్నీ విమర్శలు కొంతమంది చేస్తున్నారు. అవును కోహ్లీ స్వార్థపరుడు, శతకోటి ప్రజల కలలను అనుసరించేంత స్వార్థపరుడు. ఇంత సాధించిన తరువాత కూడా జట్టు విజయంకోసం ప్రయత్నించేంత స్వార్థపరుడు. కొత్త బెంచ్ మార్క్ లను సెట్ చేయగల స్వార్థపరుడు.. తన జట్టును గెలిపించేంత స్వార్థపరుడు కోహ్లీ అంటూ వెంకటేశ్ ప్రసాద్ కోహ్లీపై విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేశాడు.
Mohammad Hafeez Called Virat Kohli Selfish for trying to take singles for his hundred instead of hitting boundaries. #ViratKohli #CWC23 #INDvSA pic.twitter.com/cULtO3SJuL
— Shaharyar Ejaz ? (@SharyOfficial) November 6, 2023
Hearing funny arguments about Virat Kohli being Selfish and obsessed with personal milestone.
Yes Kohli is selfish, selfish enough to follow the dream of a billion people, selfish enough to strive for excellence even after achieving so much, selfish enough to set new benchmarks,… pic.twitter.com/l5RZRf7dNx— Venkatesh Prasad (@venkateshprasad) November 6, 2023